HOME »NEWS »NATIONAL »viral facebook post meet this real life santa auto driver who takes his dog with him wins hearts of netizens nk gh

Viral Post: ఆటోలో డ్రైవర్‌తో పాటే ప్రయాణిస్తున్న కుక్కపిల్ల... ఎందుకు?

Viral Post: ఆటోలో డ్రైవర్‌తో పాటే ప్రయాణిస్తున్న కుక్కపిల్ల... ఎందుకు?
ఆటోలో డ్రైవర్‌తో పాటే ప్రయాణిస్తున్న కుక్కపిల్ల... (image credit - facebook - Manjiri Prabhu)

Viral Post: ఇళ్లలో పెంపుడు జంతువుల్ని పెంచుకునేవాళ్లు... వాటిని తమతో తీసుకెళ్లరు. మరి ఆ ఆటోడ్రైవర్ కథేంటి? ఆ పప్పీ అతనితో పాటే ఎందుకు వెళ్తోంది?

  • Share this:
Viral Facebook Post: కరోనా వైరస్ మనుషులతో పాటు పెంపుడు జంతువులు, వీధి కుక్కలపైనా తీవ్ర ప్రభావం చూపింది. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీనికి తోడు జంతువుల ద్వారా కూడా కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరిని సోకుతుందనే ప్రచారంతో ప్రజలు భయపడ్డారు. సొంత ఊళ్లకు వెళ్లేవారు తాము పెంచుకుంటున్న పెంపుడు కుక్కలను రోడ్లపై వదిలేశారు. జనసంచారం పూర్తిగా తగ్గిపోవడంతో వీధికుక్కలకు అన్నం పెట్టేవారు కరవయ్యారు. దీంతో అవి ఎప్పుడూ లేనంతగా ఇబ్బందులు పడ్డాయి. పెంపుడు జంతువులకు కరోనా సోకినా, వాటి ద్వారా వైరస్ మనుషులకు సోకుతుందని ఆధారాలు లేవు. ఈ పరిస్థితుల్లో కుక్కలతో వైరస్లు మనుషులకు సోకవు అని ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఆటోడ్రైవర్. తన పెంపుడు కుక్కను తనతోనే తీసుకెళ్తూ... కంటికి రెప్పలా కాపాడుతూ... ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఇతని పేరు హర్వీందర్ సింగ్. ఆటోలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేటప్పుడు ఈ కుక్క అతనితోనే ఉంటుంది.

* ఎప్పుడూ ఆటోలోనే:


హర్వీందర్ ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ మంజిరి ప్రభు అనే ప్రయాణికురాలు ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పంచుకున్నారు. వెంటనే ఆ పోస్టు వైరల్‌ అయ్యింది. ఆ ఆటోడ్రైవర్‌ నిజ జీవితంలో అసలైన శాంటా అని సోషల్ మీడియాలో అతడిని పొగడ్తల్లో ముంచేస్తున్నారు. "జంతువులపై జాలి, దయ చూపే ఒక శాంటాను నేను నేరుగా కలుసుకున్నాను" అని మంజిరి ప్రభు ఫేస్‌బుక్ పోస్ట్‌లో హర్వీందర్ సింగ్ స్టోరీని షేర్ చేశారు. ఆటోలో వెళ్తున్నప్పుడు డ్రైవర్ సీటు దగ్గరే చిన్న కుక్కపిల్ల ఎప్పుడూ కూర్చుంటుంది. దాన్ని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు.

* ఇంట్లో ఎవరూ లేక:
బయట తిరుగుతున్న కుక్కపిల్లని ఓ రోజు హర్వీందర్ కొడుకు ఇంటికి తీసుకువచ్చాడు. దానికి రోనీ అనే పేరు పెట్టారు. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరట. దీంతో హర్వీందర్ దాన్ని రోజూ ఆటోలో తీసుకెళ్తున్నాడు. చాలామంది కోవిడ్ భయంతో పెంపుడు కుక్కలను వదిలేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో హర్వీందర్ మాత్రం తనతో పాటే రోనీని ఆటోలో తీసుకెళ్తున్నాడు.

ఇది కూడా చదవండి:Pratyusha Marriage: ఘనంగా సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం... దృశ్యాలు

కుక్కపిల్లలను వదిలించుకోవడానికి బదులుగా వాటిని ఆదుకోవాలని అతను కోరుతున్నాడు.
Published by:Krishna Kumar N
First published:December 28, 2020, 12:59 IST

टॉप स्टोरीज