Home /News /national /

VILLAGE PEOPLE IN KASARAGOD KERALA COMES TOGETHER TO SAVE STREET DOG UMG GH

Dog Surgery: మానవత్వం పరిమళించింది.. కుక్క కోసం ఏకమైన ఓ గ్రామం.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!

కేరళ రాష్ట్రంలో ఓ కుక్క కోసం గ్రామస్తులు ఏకమయ్యారు. (Photo Credit: Indian Express)

కేరళ రాష్ట్రంలో ఓ కుక్క కోసం గ్రామస్తులు ఏకమయ్యారు. (Photo Credit: Indian Express)

అనారోగ్యంతో బాధపడుతున్న మూగ జంతువుల (Animals)ను చూస్తే కొందరు చలించిపోతారు. కొందరు మానవత్వం (Humanity) చూపిస్తూ వాటికి వైద్యం కూడా అందిస్తారు. అయితే 5 కిలోల పరిమాణం ఉన్న కణితితో బాధపడుతున్న ఒక కుక్క (Dog)కు వైద్య చికిత్స అందించాలనే మానవత్వం చాటారు కేరళకు చెందిన ఒక గ్రామ ప్రజలు.

ఇంకా చదవండి ...
అనారోగ్యంతో బాధపడుతున్న మూగ జంతువులను చూస్తే కొందరు చలించిపోతారు. కొందరు మానవత్వం (Humanity) చూపిస్తూ వాటికి వైద్యం కూడా అందిస్తారు. అయితే 5 కిలోల పరిమాణం ఉన్న కణితితో బాధపడుతున్న ఒక కుక్కకు వైద్య చికిత్స అందించాలనే మానవత్వం చుల్లిక్కర (Chullikkara) అనే ఒక గ్రామ ప్రజలందరిలో పరిమళించింది. భారీ కణితి (Tumour)తో నరకయాతన అనుభవిస్తున్న ఈ శునకానికి సర్జరీ చేయించేందుకు కేరళకు చెందిన ఈ గ్రామ ప్రజలందరూ ఏకమయ్యారు. ఇటీవల ఒక ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రిలో దీనిని చేర్పించారు. సర్జరీ సక్సెస్ కావడంతో ఈ కుక్క మరో రెండు రోజుల్లో డిశ్చార్జి అయి గ్రామంలో అడుగుపెట్టనుంది. దీని రాక కోసం ఇప్పుడు గ్రామస్థులు కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ వేచి చూస్తున్నారు.

వివరాలలోకి వెళ్తే.. కాసర్‌గోడ్‌లోని కోడోం-బెల్లూర్ గ్రామ పంచాయితీలోని చుల్లిక్కర గ్రామంలో ముత్తుమణి అనే ఒక ఆడ కుక్క నివసిస్తోంది. ఇండియన్ పరియా డాగ్ అనే జాతికి చెందిన ఈ శునకం ఏటా కుక్క కూనలకు జన్మనిస్తుంది. ఈ పిల్లలను గ్రామంలోని చాలా మంది ప్రజలు తీసుకెళ్తుంటారు. అయితే మూడు నెలల క్రితం ముత్తుమణి కొన్ని కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. కొన్ని రోజుల తర్వాత దీని రొమ్ముల వద్ద ఒక వాపు కనిపించింది. వారం రోజుల వ్యవధిలోనే ఈ వాపు చాలా పెద్దదైంది. ఇది గమనించిన గ్రామస్థులు ఆందోళన పడ్డారు. అనంతరం దానిని రాజపురంలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఒక డాక్టర్ సిరంజితో వాచిన శరీర భాగం నుంచి ద్రవాన్ని వెలికితీశారు. దీంతో కుక్క రొమ్ముల వద్ద వాపు తగ్గింది.



వాపు తగ్గడం చూసి గ్రామస్థులు హమ్మయ్య అనుకునేలోపే మళ్లీ ఆ వాపు తిరిగి వచ్చింది. ఒక వారంలోగా ఆ వాపు ఎప్పట్లాగానే పెద్దగా తయారవడంతో మరొకసారి ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఈసారి తమ గ్రామానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికరిపూర్‌లోని గవర్నమెంట్ వెటర్నరీ ఆసుపత్రిలో చేర్పించాలి అనుకున్నారు. ఇందుకు వెటర్నరీ సర్జన్ ఎ మురళీధరన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే ఆసుపత్రిలో పోస్ట్-సర్జరీ కేర్ ఫెసిలిటీ.. సరిపడా కుట్లు లేకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యం గ్రామస్థులకు ఒక విజ్ఞప్తి చేసింది. ప్రజలు కుట్లను అందిస్తేనే తాము ముత్తుమణి కేసును తీసుకోగలుగుతామని హాస్పిటల్ వెటర్నరీ డాక్టర్లు గ్రామస్థులకు చెప్పారు. దీంతో గ్రామస్థులు చుల్లిక్కర వచ్చిన జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ బేబీ బాలకృష్ణన్‌కు ఈ కుక్క గురించి వివరించారు. జిల్లా పంచాయతీ త్రికరిపూర్ ఆసుపత్రిలోని యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రంతో కలిసి పనిచేస్తుంటుంది. దీంతో ఈ ఆసుపత్రిలో ముత్తుమణి కేసును రిఫర్ చేయమని డాక్టర్ మురళీధరన్‌ను బేబీ బాలకృష్ణన్‌ కోరారు.

ఆ డాక్టర్ రిఫరెన్స్‌తో ముత్తుమణి కేసును ప్రభుత్వ డాక్టర్లు టేకప్ చేశారు. అనంతరం ఏబీసీ సెంటర్ నుంచి ఒక వెహికల్ వచ్చి మరీ ముత్తుమణిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లింది. ఈ ప్రభుత్వ పశువైద్యశాలలో టాప్ సర్జన్ అయిన డాక్టర్ ఫాబిన్ ఎం. పైలీ ముత్తుమణి క్షీరరసగ్రంధి కణితితో బాధ పడుతుంది అని గుర్తించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి 5 కిలోల బరువున్న క్షీరరసగ్రంధి కణితిని తొలగించారు. ప్రస్తుతం ముత్తుమణి ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సర్జన్ తెలిపారు. సీనియర్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ ఎ మురళీధరన్ మాట్లాడుతూ కణితి ముత్తుమణి వీపును వంచి దాన్ని బాగా బలహీనపరిచిందని తెలిపారు. ఈ కుక్క ఇప్పుడు త్రికరిపూర్ వెటర్నరీ హాస్పిటల్‌లోని ఏబీసీ సెంటర్ షెల్టర్‌లో కోలుకుంటుంది. ఈ డాగ్ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిగా ఉందని వైద్యులు తెలిపారు మరో రెండు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని పేర్కొన్నారు. దీంతో దీని కోసం ఆ గ్రామంలోని దుకాణాదారులు క్యాబ్ డ్రైవర్లు ఇలా అందరూ వేచి చూస్తున్నారు. అయితే ఒక కుక్క కోసం ఏకంగా గ్రామమంతా కదిలింది అని తెలిసి అందరూ ఫిదా అవుతున్నారు.
Published by:Mahesh
First published:

Tags: Doctors, Dog, Kerala

తదుపరి వార్తలు