ఎన్‌కౌంటర్‌పై విపక్షాల అనుమానాలు.. వికాస్‌తో పాటు నిజాలూ సమాధి

వికాస్ దుబే నిజంగానే పోలీసుల నుంచి పారిపోవాలని భావిస్తే.. ఉజ్జయినిలో లొంగిపోయే వాడే కాదని అంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌తో పోలీసులు, రాజకీయ నేతలకు సంబంధాలున్నాయని.. ఆ నిజాలు బయటపడతాయనే భయంతోనే ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు

news18-telugu
Updated: July 10, 2020, 10:43 AM IST
ఎన్‌కౌంటర్‌పై విపక్షాల అనుమానాలు.. వికాస్‌తో పాటు నిజాలూ సమాధి
ఎన్‌కౌంటర్‌పై విపక్షాల అనుమానాలు.. వికాస్‌తో పాటు నిజాలూ సమాధి
  • Share this:
గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై రాజకీయ దుమారం రేగుతోంది. వికాస్ ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, సమాజ్‌వాదీ పార్టీ సహా పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వికాస్ దుబే నిజంగానే పోలీసుల నుంచి పారిపోవాలని భావిస్తే.. ఉజ్జయినిలో లొంగిపోయే వాడే కాదని అంటున్నారు. గ్యాంగ్‌స్టర్‌తో పోలీసులు, రాజకీయ నేతలకు సంబంధాలున్నాయని.. ఆ నిజాలు బయటపడతాయనే భయంతోనే ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు. వికాస్ దుబేతో పాటు నిజాలనూ సమాధి చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే.. బూటకపు ఎన్‌కౌంటర్ చేశారని మండిపడుతున్నారు.

వికాస్‌ను ఎన్‌కౌంటర్ చేస్తారని చాలా మంది ముందే ఊహించారు. వికాస్ దుబే పారిపోవాలని భావిస్తే ఉజ్జయిన్‌లో ఎందుకు లొంగిపోతాడు. క్రిమినల్‌తో సంబంధాలున్న అధికార శక్తులు రహస్యాలు ఏవి? గత 10 రోజుల కాల్ డేటా వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదు.
రణ్‌దీప్ సూర్జేవాలా
నేరస్తుడు చనిపోయాడు. మరి అతడికి అండగా ఉన్న వారి సంగతేంటి?
ప్రియాంక గాంధీ


చనిపోయిన వ్యక్తి ఎలాంటి నిజాలు చెప్పలేడు.
ఒమర్ అబ్దుల్లామేం ఏదైతే అనుమానిస్తున్నామో అదే ఇప్పుడు జరిగింది. వికాస్ దుబేతో సంబంధమున్న పోలీసులు, అధికారులు, రాజకీయ నేతల వివరాలు ఇక ఎప్పటికీ బయటపడవు.
దిగ్విజయ్ సింగ్వాస్తవానికి కారు బోల్తా పడలేదు. రహస్యాలను పల్టీ కొట్టించి ప్రభుత్వం బతికిపోయింది. అఖిలేష్ యాదవ్


ఇది ఊహించినదే. డాన్ నేతృత్వంలో పనిచేసే అతి పెద్ద సమూహం యూపీ పోలీసులు. ఇప్పుడు అంతా సెటిల్ అయింది. మంచి కోసం అన్ని నిజాలను సమాధి చేశారు.
కార్తి చిదంబరం


యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయినట్లు యూపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని శివ్లీకి తరలిస్తున్న క్రమంలో.. కాన్పూర్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో.. వికాస్ దుబే మరణించాడని పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని కాన్పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Published by: Shiva Kumar Addula
First published: July 10, 2020, 10:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading