Vikas dubey encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే హతం

వికాస్ దుబే

Vikas dubey encounter: వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి కాన్పూర్‌కు తీసుకువస్తున్న సమయంలో కాన్పూర్ శివారులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కునేందుకు యత్నించాడు.

  • Share this:
    యూపీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కాల్పుల్లో వికాస్ దుబే చనిపోయినట్లు యూపీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని శివ్లీకి తరలిస్తున్న క్రమంలో.. కాన్పూర్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కొని కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో.. వికాస్ దుబే మరణించాడని పోలీసులు తెలిపారు. అతడి మృతదేహాన్ని కాన్పూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

    వికాస్ దుబే ప్రయాణిస్తున్న వాహనం రోడ్డుప్రమాదానికి గురయింది. ఆ సమయంలో పోలీసులన నుంచి పిస్టల్ లాక్కొని వికాస్ తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. లొంగిపోవాలని చెప్పినా వినలేదు. పోలీసులపై కాల్పులు జరిపాడు. పోలీసల ఎదురు కాల్పుల్లో అతడు చనిపోయాడు.
    వెస్ట్ కాన్పూర్ ఎస్పీ


    8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న వికాస్ దూబెను మధ్యప్రదేశ్ పోలీసులు గురువారం ఉదయం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఉజ్జయిని మహాకాళి ఆలయం సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడితో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం మధ్యప్రదేశ్ పోలీసులు అతడిని యూపీ స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించింది. ఉజ్జయిని నుంచి రోడ్డుమార్గంలో శివ్లీ (యూపీ)కి తరలిస్తుండగా.. కాన్పూర్ సమీపంలో STF వాహనం బోల్తాపడింది. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

    యూపీలో వరుసగా మూడు రోజులుగా ఎన్‌కౌంటర్ ఇది. రెండు రోజుల క్రితం వికాస్ దుబే అమర్ దుబే ప్రధాన అనుచరుడు అమర్ దుబేని కాల్చి చంపగా.. గురువారం మరో ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేశారు. నిన్న వికాస్ అనుచరులు బహువా దుబే, ప్రభాత్ మిశ్రా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.

    జూలై 3న కాన్పూర్ సమీపంలోని చౌబేపూర్ పోలీస్ స్టేషన్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిది. రౌడీల కాల్పుల్లో 8 మంది పోలీసులు చనిపోయారు. వీరిలో డీఎస్పీతో పాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే, అతడి అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఐతే కొందరు పోలీసులు వికాస్ దూబెకు అనుకూలంగా పనిచేస్తున్నారని.. వారు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ వినయ్ తివారీని బుధవారం యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వికాస్ దూబె విచారణలో కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. తనకు చాలామంది పోలీసులతో సంబంధాలున్నాయని అతడు చెప్పినట్లు సమాచారం. ఐతే వారి వివరాలను వెల్లడించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published: