Home /News /national /

VIJAY MALLYAS ASSETS IN FRANCE WORTH 14 CRORES SEIZED MS

Vijay Mallya కు భారీ షాకిచ్చిన ఈడీ.. ఆ దేశంలోని ఆస్తులు స్వాధీనం

విజయ్ మాల్యా (ఫైల్)

విజయ్ మాల్యా (ఫైల్)

Vijay Mallya Assets Seized: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు Enforcement Directorate ఊహించని షాకిచ్చింది. ఫ్రాన్స్ లో ఉన్న ఆయన ఆస్తులను సీజ్ చేసింది.

  • News18
  • Last Updated :
    లిక్కర్ కింగ్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు వ్యవస్థాపక అధినేత విజయ్ మాల్యా కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఊహించని షాకిచ్చింది. భారత్ లో బ్యాంకులను నిండా ముంచి.. యూకేలో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించాలని కొద్దికాలంగా ఈడీ ప్రతినిధులు చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. కాగా తాజాగా ఈడీ ఆయనకు మరో షాకిచ్చింది. ఫ్రాన్స్ లో ఉన్న ఆయన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఫ్రాన్స్ లో 32 అవెన్యూ ఫోచ్ లో ఆయనకు ఉన్న ఆస్తిని ఈడీ అభ్యర్థన మేరకు అక్కడి అధికారులు సీజ్ చేశారు.

    ఈడీ సీజ్ చేసిన ఆస్తుల  విలువ 1.6 మిలియన్ యూరోలు. అంటే మన భారతీయ కరెన్సీలో రూ. 14 కోట్ల పై మాటే. భారతీయ బ్యాంకులకు సుమారు రూ. 9 వేల కోట్ల రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యాపై దేశంలో సీబీఐ, ఈడీతో పాటు పలు ఇతర ఏజెన్సీలు కూడా కేసులు నమోదు చేశాయి. అంతేగాక ఉద్దేశపూర్వక ఎగదారుల జాబితాలోనూ ఆయన పేరుంది.

    2016 నుంచి విజయ్ మాల్యా.. యూకేలో తలదాచుకుంటున్నారు. ఆయనను భారత్ కు రప్పించడానికి ఇక్కడి అధికారులు.. యూకేలో న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.
    Published by:Srinivas Munigala
    First published:

    Tags: Enforcement Directorate, Vijay Mallya

    తదుపరి వార్తలు