• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • VIJAY MALLYA NOT BEING EXTRADITED TO INDIA ANYTIME SOON SAYS BRITISH HIGH COMMISSION BS

కథ మళ్లీ మొదటికి...ఇప్పట్లో విజయ్ మాల్యా భారత్‌కు రావటం కష్టమే..

విజయ్ మాల్యా(ఫైల్ ఫోటో)

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తారని, వెంటనే అధికారులు అతనితో కలిసి ఇండియాకు బయలుదేరి వస్తారని అనుకున్నా.. అది ఇప్పట్లో జరిగేలా లేదు.

  • Share this:
    లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగిస్తారని, వెంటనే అధికారులు అతనితో కలిసి ఇండియాకు బయలుదేరి వస్తారని అనుకున్నా.. అది ఇప్పట్లో జరిగేలా లేదు. ఇప్పుడే అతడ్ని భారత్‌కు పంపలేమని, చట్టంలో ఉన్న నిబంధనల దృష్ట్యా వాటిని పరిష్కరించాకే అతడ్ని పంపిస్తామని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొంది. అయితే, ఆ చట్ట సమస్య ఏంటన్నది చెప్పేందుకు నిరాకరించింది. అది రహస్యమని, యూకే లా ప్రకారం ఆ సమస్య పరిష్కరించాకే మాల్యాను దేశం దాటిస్తామని స్పష్టం చేసింది. అంటే.. మాల్యా ఇప్పట్లో భారత్‌కు రావడం కష్టమేనా? అన్న సందేహం తలెత్తుతోంది. లండన్‌ కోర్టుల్లో ఎదురుదెబ్బ తగలగడంతో మాల్యాను భారత్‌కు తీసుకొచ్చి ముంబై ఆర్ధర్ రోడ్డులోని సెంట్రల్‌ జైలుకు తరలిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు యూకే చట్టం మాల్యాకు చుట్టంలా మారినట్లు అనిపిస్తోంది.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: