Modi BirthDay: ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే లడ్డూలు గిఫ్ట్... ఎక్కడో తెలుసా.?

ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, జీవజాతికి ఎంతో నష్టం కలగుతోందని.. అందుకే ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు

news18-telugu
Updated: September 16, 2019, 10:53 PM IST
Modi BirthDay: ప్లాస్టిక్ బాటిల్ ఇస్తే లడ్డూలు గిఫ్ట్... ఎక్కడో తెలుసా.?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: September 16, 2019, 10:53 PM IST
మంగళవారం ప్రధాని మోదీ 69వ బర్త్ డే. ప్రధాని పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు బీజేపీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇక ఒకసారి మాత్రమే వాడే ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు కంకణం కట్టుకున్న బీజేపీ ప్రధాని మోదీ పుట్టిన రోజు నుంచే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం వినూత్న కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ శ్రీకారం చుట్టారు. బాటర్ బాటిల్‌లాంటి ప్లాస్టిక్ వస్తువును ఇస్తే లడ్డూని బహుమతిగా ఇచ్చే ప్రోగ్రాం ఏర్పాటు చేశారు.

ఢిల్లీలోని పాలికా బజార్ ప్రాంతంలో మంగళవారం 'ఏక్ ప్లాస్టిక్-ఏక్ లడ్డూ' కార్యక్రమం జరగనుంది. ప్లాస్టిక్‌ను వదులుకోవాలని భావించే వాళ్లు ఏదేనీ ఒక ప్లాస్టిక్ వస్తువును తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. ప్లాస్టిక్‌ను వదులుకున్నందుకు గిఫ్ట్‌గా ఓ లడ్డూను అందిస్తారు నిర్వాహకులు. మంగళవారం వెయ్యి కిలోల లడ్డూలు పంచేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు ప్లాస్టిక్‌ని నిషేధించాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు గోయెల్. ప్లాస్టిక్ వల్ల పర్యావరణం దెబ్బతింటోందని, జీవజాతికి ఎంతో నష్టం కలగుతోందని.. అందుకే ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు నాడే ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు విజయ్ గోయెల్.

First published: September 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...