దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75సంవత్సరాలు అవుతోంది. అయినా చాలా ప్రాంతాల్లో రోడ్లుRoads లేని గ్రామాలు, కరెంట్(Current) లేని పల్లెలు, తాగడానికి గుక్కెడు నీళ్లు( Drinking water) కూడా దొరకని ఊళ్లు ఉన్నాయంటే ఎంతటి దౌర్భాగ్యమైన స్థితిలో ప్రజలు గడుపుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఎందుకింత చులకనగా మాట్లాడాల్సి వస్తోందంటే ..మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని డిండోరి(Dindori)జిల్లా ఘుసియా(Ghusia)గ్రామానికి చెందిన ఆడపడుచులు, మహిళలు బిందెడు నీళ్ల కోసం పడుతున్న తిప్పలు అత్యంత బాధాకరంగా ఉన్నాయి. పురాణాల్లో చెప్పుకున్నట్లుగా ఆకాశంలో ఉన్న గంగను నేలకు దింపడానికి ఆ భగీరథుడు పడిన కష్టంతో పోల్చాల్సిన పరిస్థితి నెలకొంది. కాకపోతే ఆ భగీరథుడు ఆకాశం నుంచి గంగను నేలకు తెస్తే..మధ్యప్రదేశ్‌లో ఆడపడుచులు మాత్రం పాతాళంలో ఉన్న గంగను ప్రాణాలు పణంగా పెట్టి బయటకు తోడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
గుక్కెడు నీళ్ల కోసం..
భారతదేశం సహజవనరులకు పుట్టినిల్లని చరిత్రల్లో రాసి ఉంది. కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితి మచ్చుకైన కనిపించడం లేదు. సాక్షాత్తు బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోని గ్రామస్తులు మంచినీళ్ల కోసం మైళ్ల దూరం బిందెలు తలపై పెట్టుకొని నడవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఘుసియా గ్రామంలోకి కుళాయి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వేసవి కాలం కదా ప్రజల ఇక్కట్లను గుర్తించి ప్రభుత్వం, పాలకులు ట్యాంకర్లతో నీళ్లను గ్రామాల్లోని ప్రజలకు సప్లై చేస్తారా అంటే అంది లేదు. ఇలాటి క్లిష్ట పరిస్థితుల్లో గొంతు ఎండిపోకుండా తడుపుకునేందుకు నాలుగు చుక్కల నీళ్ల కోసం ఊరి చివర్లో ఉన్న మూడు ఎండిపోయిన బావుల్లోకి దిగి వాటిలో చెలమతీసి నీళ్లు నింపుకోవాల్సిన దయనీయస్థితి అక్కడి ప్రజలకు దాపురించింది.
ఆడబిడ్డల అరిగోస..
ఇంకా దరిద్రమైన పరిస్థితి ఏమిటంటే గ్రామ శివార్లలో ఉన్న బావుల్లో తోడుకోవడానికి బెకెట్లు వేసుకునే సౌకర్యం లేదు. పోనీ మోటారు పెట్టి పైకి లాగడానికి బావిలో ఆస్థాయిలో నీరు లేదు. దీంతో బిందెడు నీళ్ల కోసం ఆడవాళ్లే బావిలోకి దిగి..అక్కచ ఊటల్లో చెలిమలు తీసుకొని మూతతోనో, చిన్న డబ్బాతోనో బిందెలో నీళ్లు నింపుకోవాలి. తాడు కట్టి పైకి లాక్కోవాలి. మళ్లీ కిలోమీటర్ల దూరం ఇంటికి వెళ్లాలి. అంత వ్యయ, ప్రయాసలు పడి తీసుకొచ్చుకున్న నీటిని వడపోసుకొని తాగాల్సిన దుర్భరమైన పరిస్థితి తలెత్తింది.
పానీ పట్టు యుద్ధం..
ఘుసియా గ్రామంలో నీటి కరువుకు తోడు వేసవి తీవ్రత పెరగడంతో పరిస్థితి భయంకరంగా ఉంది. దాదాపు ఎండిపోయిన బావుల నుంచి ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టి నీటిని తెచ్చుకుంటున్నారు. ఆడవాళ్లు మంచినీళ్ల కోసం బావిలోకి దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగా పాలకులారా ఇలాంటి పరిస్థితి మీకే తలెత్తితే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
ఇంకెన్నాళ్లీ తిప్పలు..
ఈ ప్రాంతంలో నీటి కరువు ఇప్పటి సమస్య కాదు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఈ తిప్పలు పడుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు వాగ్దానాలు ఇచ్చి మర్చిపోతే జీతాలు తీసుకునె అధికారులు మాత్రం ఇక్కడి ప్రజల గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకే ఇకపై గ్రామంలోకి కుళాయి కనెక్షన్లు ఇచ్చే వరకు ఓట్లు వేయవద్దని నిర్ణయించుకున్నామని ..అందుకే ప్రాణాలకు తెగించైనా బావిలోకి దిగి నీళ్లు మోసుకెళ్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Viral Video, Water Crisis