చిరుత పులి ఊరి మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా. ఎవరూ ఊహించలేం. కానీ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో వాళ్లు ప్రత్యక్షంగా చూశారు. పులి ఊరి మీద పడటమే కాదు..జనంపైకి విరుచుకుపడుతూ పంజా విసరడంతో ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఒకరిద్దరు కాదు..పదుల సంఖ్య గ్రామస్తులు పులి పంజాకు చిక్కకుండా ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకొని పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్ మహరాజ్గంజ్ (Maharajganj)జిల్లాలోని శ్యామ్దేర్వా పోలీస్ స్టేషన్ సమీపంలోని ఛతీరామ్(Chathiram)గ్రామానికి సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. ఆ అడవిలోంచి ఓ పులి (Tiger)వచ్చి పక్కనే ఉన్న వరి పొలాల్లో పనులు చేసుకుంటున్న కూలీలు, స్థానికులపై పంజా విసిరింది. పులి దగ్గరకు వచ్చేంత వరకు గమనించని కూలీలు..దాని శబ్ధం, పరుగులు చూసి భయంతో హడలిపోయారు. పొలంలో పనులు ఆపేసి ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. పులికి చిక్కకుండా పరుగులు పెడుతుంటే కూడా వదల్లేదు. పొలాల్లోకి ఎంటరైన చిరుత వరుసగా దొరికిన వాళ్లను దొరికినట్లు ఆరుగురిపై దాడి చేసింది. వరి పొలంలోకి చిరుత వచ్చిందన్న కూలీల అరుపులు విని గ్రామస్తులు, పక్కనే పనులు చేసుకుంటున్న వాళ్లు కూడా పారిపోతుండగా అందర్ని వెంటాడుతూ పరుగులు పెట్టించింది. సుమారు అరగంట సేవు అందరికి గుండెల్లో చావు భయం పుట్టించింది పులి.
ఊరి జనంపై పంజా విసిరిన పులి..
ఛతీరామ్ గ్రామంలోకి పులి వచ్చిందన్న విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. పులిని బంధించేందుకు అవసరమయ్యే వస్తువులతో వచ్చినప్పటికి వారిని సైతం వదల్లేదు. పులి దాడిలో ఓ ఫారెస్ట్ అధికారి సైతం గాయపడ్డాడు. ఊరంతా ఏకమై పులిని పట్టుకునేందుకు ప్రయత్నించడంతో వరి పొలాల్లోంచి వచ్చిన దారిలోనే అడవిలోకి పారిపోయింది చిరుత.
పులి సృష్టించిన బీభత్సంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. ఇకపై పొలాలకు ఒంటరిగా ఎలా వెళ్లాలి..వ్యవసాయ పనులు ఎలా చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ అడవిలోకి పోయిన పెద్దపులి ఊరి మీద పడితే మా ప్రాణాలు కాపాడే వాళ్లు ఎవరుంటారని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా అటవీశాఖ అధికారులు తమ వ్యవసాయ పొలాల దగ్గర బోన్లు ఏర్పాటు చేసి పులిని బంధించాలని వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiger Attack, Uttar pradesh