Covid 19: కరోనా పేషెంట్ల ముందు డాక్టర్ మైకెల్ జాక్సన్ స్టెప్పులు... సూపర్ వైరల్ వీడియో

Covid 19 Doctor Dance: వీడియోల్లో ప్రత్యేకమైనవి వైరల్ వీడియోలు... మరి వాటి కంటే దుమ్మురేపే వాటిని సూపర్ వైరల్ వీడియోలు అనుకుంటే... ఇది అలాంటిదే.

news18-telugu
Updated: October 19, 2020, 2:22 PM IST
Covid 19: కరోనా పేషెంట్ల ముందు డాక్టర్ మైకెల్ జాక్సన్ స్టెప్పులు... సూపర్ వైరల్ వీడియో
Covid 19: కరోనా పేషెంట్ల ముందు డాక్టర్ మైకెల్ జాక్సన్ స్టెప్పులు... సూపర్ వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
Covid 19 Doctor Dance: ప్రపంచంలో రోజువారీ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నది ఇండియాలోనే అని మనకు తెలుసు. మరి ఎవరికైనా కరోనా వస్తే... వాళ్లు చాలా కాన్ఫిడెంట్‌తో ఉండాలి. నాకు కచ్చితంగా కరోనా తగ్గిపోతుంది. నాకు ఏం కాదు అనే ధైర్యం వాళ్లలో రావాలి. అలా కరోనా పేషెంట్లలో ధైర్యం నింపేందుకు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, మెడికల్ కేర్ వారు, కరోనా వారియర్లు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా... చాలా చోట్ల డాక్టర్లే డాన్సులు వేసి... పేషెంట్లలో ఉత్సాహం తెస్తున్నారు. నిజానికి ఇదో రకమైన థెరెపీ. ఇలా పేషెంట్లలో ఉత్సాహం తేవడం ద్వారా... వారి బాడీలో కణాలు ఉత్తేజితం అవుతాయి. తద్వారా... వారు... కరోనాను ఎదుర్కొనేందుకు మానసికంగా సన్నద్ధమవుతారు.

తాజాగా... అసోంలో డాక్టర్ అరూప్ సేనాపతి... మైకెల్ జాక్సన్ స్టెప్పులేసి... కరోనా పేషెంట్లను ఉత్సాహ పరిచారు. ప్రొఫెషనల్ డాన్సర్లు ఎలా స్టెప్స్ వేస్తారో... ఆ రేంజ్‌లో ఆయన డాన్స్ వేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే... అరూప్ సేనాపతి... వృత్తిరీతయా సిల్చార్ మెడికల్ కాలేజీలో ENT సర్జన్. ఈ డాన్సులు, స్టెప్పులు వేసే టైమ్ ఎక్కడుంటుంది. ఎప్పుడో కాలేజీ రోజుల్లో వేసిన అనుభవాన్ని రంగరించుకొని... ఇప్పుడు మళ్లీ దుమ్మురేపారు.




డాక్టర్ అరూప్ డాన్స్ వేస్తున్నప్పుడు ఆయన కొలీగ్ డాక్టర్ సయ్యద్ ఫాయిజాన్ అహ్మద్... మొబైల్ తో వీడియో రికార్డ్ చేశారు. దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చెయ్యగా... కొన్ని గంటల్లోనే దాన్ని 4లక్షల మందికి పైగా చూశారు. దీన్ని ఇప్పటికే 29 వేల మంది లైక్ చేశారు. 7వేల మంది షేర్ చేసుకున్నారు. 900 మంది కామెంట్లు రాశారు. ఇలా ఈ వీడియో తుఫానులా చెలరేగిపోతోంది.


తనకు గానీ కరోనా వస్తే... ఈ డాక్టర్ తన ముందు కూడా డాన్స్ వెయ్యాలని ఓ నెటిజన్ కోరారు. వృత్తిని ప్రేమించేవారు... ఏ పనిలో వున్నా... ఇలాగే ఉత్సాహంగా చేస్తారని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇలా రకరకాలుగా స్పందిస్తున్నారు.


ఇండియాలో కొత్తగా 55,722 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 75,50,273కి చేరింది. అలాగే... కొత్తగా 579 మంది మాత్రమే చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,14,610కి చేరింది. మరణాల రేటు మాత్రం రోజూలాగే... 1.5 శాతమే ఉంది. ఇండియాలో నిన్న 66,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు మరింత పెరిగి... 88.3 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,72,055గా ఉన్నాయి.
Published by: Krishna Kumar N
First published: October 19, 2020, 2:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading