Home /News /national /

VIDEO OF AN OLD MAN DRINKING DIRTY WATER AFTER BETTING WITH VILLAGERS FOR RS 2000 IN MADHYA PRADESH GOES VIRAL SNR

రెండు వేల కోసం ఆ ముసలోడు అంత పని చేశాడు..కక్కూర్తి పాడుగాను

Photo Credit:Youtube

Photo Credit:Youtube

Viral video: రెండు వేల కోసం ఆ ముసలోడు అంత పనిచేశాడు. ఊరి జనంతో పంతానికి పోయి పందెం కాశాడు. పందెంలో నెగ్గడానికి చివరకు మురికి నీళ్లు తాగి వార్తలకెక్కాడు. ఈవికారం కలిగించే వార్త మధ్యప్రదేశ్‌లో జరిగింది.

వృద్దాప్యం మీద పడిన వాళ్లలో చాదస్తం, మొండితనం రెండు కనిపిస్తాయి. ఈ మాట ఎందుకు అంటున్నామంటే మధ్యప్రదేశ్‌(Madhya pradesh)లో ఓ వృద్దుడు గ్రామస్తులతో షరతు కట్టి చేయకూడని పని చేసి వార్తలకెక్కాడు. మధ్యప్రదేశ్‌ విదిషా జిల్లా (Vidisha district)ఆనంద్‌పూర్‌(Anandpur)పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని జవతి (Javathi)గ్రామానికి చెందిన పన్నాలాల్‌(Panna lal)అనే ముసలోడు గ్రామస్తులతోనే పందెం కాశాడు. కేవలం రెండు వేల రూపాయల (2 Thousand rupees)కోసం పారుతున్న మురికి కాలువలో నీళ్లు (Drinking dirty water) తాగుతానంటూ బెట్టింగ్‌ కట్టి ఊరి జనం అంతా చూస్తుండగా ఈ పని చేశాడు. జనం సరదాగాకి ఆటపట్టించాలని చూస్తే పన్నాలాల్‌ నిజంగానే చేయడంతో అంతా షాకయ్యారు. అంతే కాదు అతను నిజంగా మురికి నీళ్లు తాగుతాడా లేదా అని కొందరు సెల్‌ఫోన్‌లలో రెడీ అయ్యారు. ముక్కులు పగిలే దుర్వాసన వస్తున్న మురికి కాలువలో నీళ్లు దోసిళ్లతో పట్టుకొని తాగేశాడు పన్నాలాల్. అసలు ముసలోడు అంతగా ఎందుకు పట్టుబట్టి పందెం కాసాడో తెలుసా. తమలపాకులు కోస్తూ జీవనోపాధి పొందే పన్నాలాల్..అతని చేతిలో తమలపాకు జారి మురికి నీళ్లలో పడింది. వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని తమలపాకు తొడెం తుంచి నోట్లో పెట్టుకున్నాడు. అది చూసిన గ్రామస్తులు అంత కక్కూర్తి ఎందుకు ఆ మురికి నీళ్లు కూడా తాగొచ్చుగా అని హేళన చేశారు. గ్రామస్తులు మాట్లాడిన మాటల్ని సీరియస్‌గా తీసుకున్న పన్నాలాల్ నాకు వెయ్యి రూపాయలు ఇస్తే చెప్పండి తాగి చూపిస్తానంటూ మురికి నాటిని తాగేందుకు పందెం కాశాడు.

మురికి నీళ్లు తాగుతానని పందెం..
పన్నాలాల్‌ పంతానికి పోయి మురికి నీటిని తాగేందుకు గ్రామస్తులతో పందెం కాశాడు. దీనంతటికి సాక్షిగా గ్రామ సర్పంచ్‌ భర్త ఉత్తమ్‌సింగ్‌ కుష్వాహా వ్యవహరించాడు. అంతే కాదు మురికి నీళ్లు తాగుతానంటూ సవాల్ చేసిన పెద్దాయనకు సర్ది చెప్పాల్సింది పోయి కాలువలో నీళ్లు తాగితే రెండు వేల రూపాయలు ఇస్తానంటూ మరింత రెచ్చగొట్టాడు. అంతే డబ్బులు వస్తాయన్న ఆశ, గ్రామస్తుల ముందు పంతం నెగ్గించుకోవాలన్న మొండి ఆలోచనతో కాలువ దగ్గర అందరూ చూస్తుండగా కూర్చొని దోసిళ్లతో కంపు వాసన వస్తున్న నీళ్లను గొంతులో పోసుకున్నాడు. పన్నాలాల్‌ చేసిన పాడు పనిని గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పెద్దాయన పరువు కాస్తా మురికి కాలువ దగ్గర పోయింది.

ముసలోడికి బుద్ధి లేదు..వాళ్లకేమైంది..
మారుమూల గ్రామంలో జరిగిన ఈ పందెం వీడియో ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. పెద్దాయన ఏదో చాదస్తంతో బెట్టింగ్‌కి ఒప్పుకుంటే అంత మూర్ఖంగా వ్యవహరించాల అని వీడియో చూసిన వాళ్లాంత గ్రామస్తులపై విమర్శలు చేస్తున్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Madhya pradesh, Social Media, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు