హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఆటోడ్రైవర్ ఇంటికి ఊహించని అతిథి.. రాత్రిపూట డిన్నర్ కు ఎవరు వచ్చారంటే..

ఆటోడ్రైవర్ ఇంటికి ఊహించని అతిథి.. రాత్రిపూట డిన్నర్ కు ఎవరు వచ్చారంటే..

అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్)

అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్)

Gujarat: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Gujarat, India

సాధారణంగా మన చుట్టు ఉన్న స్నేహితులు, తెలిసిన వారు కొన్నిసార్లు లక్ బాగా ఉండి రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లుంటారు. మరికొందరు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తుంటారు. మంచి స్థానంలో ఉంటారు. అయితే.. కొందరు మాత్రం ఎలాంటి అహాంకారం లేకుండా సాదా, సీదాగాఉంటారు. కానీ మరికొందరు దీనికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. అప్పటి దాక.. లేని డబ్బులు, అధికారం కన్పించగానే మరోలా ప్రవర్తిస్తుంటారు. కానీ కొందరు మాత్రం ఎంత పెద్ద స్థానంలో ఉన్న ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారి ప్రేమను, అనురాగాన్ని చూరగొంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీ (Delhi) సీఎం, ఆప్ ఆద్మీ పార్టీ కన్వీనర్ (Arvind Kejriwal) మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన రెండు రోజుల పాటు గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో.. ఆయన పలు ప్రాంతాలలో సమావేశాలలో పాల్గొన్నారు. అయితే.. ఒక ఆటో డ్రైవర్ తన ఇంటికి డిన్నర్ కు రావాలని అభ్యర్థించాడు. అయితే.. దీనికి ఆయన తప్పకుండా వస్తానని చెప్పాడు. అంతే కాకుండా.. నగరంలోని ఘట్లోడియా ప్రాంతంలో నివసించే విక్రమ్ దంతాని ఇంటికి వెళ్లాడు. ఏకంగా సీఎం తన ఇంటికి భోజనంకు రావడాన్ని అతను నమ్మలేకపోయాడు.

ఆ తర్వాత.. కాసేపట్లో వంటలను పూర్తి చేయించాడు. అక్కడే సాముహికంగా కేజ్రీవాల్, ఆట్రోడ్రైవర్ విక్రమ్ దంతానితో కలిసి భోజనం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది. అయితే.. కేజ్రీవాల్, ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్తుండగా , గుజరాత్ పోలీసులు అడ్డుచెప్పారు.కాసేపు వారి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎట్టకేలకు కేజ్రీవాల్, ఆటోడ్రైవర్ ఇంటికి చేరుకుని అతనితో కలిసి సాముహిక భోజనంలో పాల్గొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా ఈ నెల 8వ తేదీన బీహార్ లోని నవాడాలోని పోలీస్ స్టేషన్(Nawada Police Station) రివ్యూకు వచ్చారు నవాడా ఎస్పీ గౌరవ్ మంగళ.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో స్టేషన్ లో ఎస్పీ తనిఖీ చేశారు. అయితే అక్కడ విధుల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో వారిని లాకప్‌లో ఉంచి తాళం వేశాడు ఎస్పీ. ముగ్గురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు సబ్‌ ఇన్‌స్పెక్టర్లను అర్ధరాత్రి లాకప్‌లో వేసి దాదాపు రెండు గంటలపాటు ఉంచాడు. తర్వాత వదిలిపెట్టాడు. లాకప్‌లోని సీసీ కెమెరాలో ఆ ఐదుగురు పోలీసులు బందీలుగా ఉన్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. లాకప్‌లో ఐదుగురు పోలీసు అధికారులు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎస్పీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఎస్పీని ప్రశ్నించగా అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పారేశాడు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Aravind Kejriwal, Autowala, Gujarat, VIRAL NEWS

ఉత్తమ కథలు