తాప్సీ సినిమా చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ మూవీకి తుషార్ హీరానదని దర్శకత్వం వహించగా అనురాగ్ కశ్యప్ నిర్మించారు. తన సినీ కెరీరర్‌లో తొలిసారిగా తాప్సీ 60 ఏళ్ల పాత్రలో నటించారు.

news18-telugu
Updated: October 6, 2019, 9:49 AM IST
తాప్సీ సినిమా చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసిన చిత్ర బృందం
  • Share this:
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ మూవీ 'సాండ్ కీ ఆంఖ్' చిత్ర బృందం శనివారం సాయంత్రం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో వెంకయ్యనాయుడుని కలిసింది. ఆయనకు చిత్ర విశేషాలను వివరించిన మూవీ యూనిట్, వెంకయ్య నాయుడుతో ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. అనంతరం వారితో కలిసి సాండ్ కీ ఆంఖ్ చిత్రాన్ని వీక్షించారు ఉపరాష్ట్రపతి. ఈ సందర్భంగా చిత్ర బృందానికి వెంకయ్యనాయుడు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమాను బాగా తీశారని,మహిళా సాధికారతను చక్కగా చూపించారని కొనియాడారు. వెంకయ్యను కలిసి వారిలో చిత్ర యూనిట్‌తో పాటు 60 ఏళ్ల మహిళా షార్ప్ షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాశి తోమర్ కూడా ఉన్నారు.

సాండ్ కీ ఆంఖ్ చిత్రాన్ని 60 ఏళ్ల మహిళా షార్ప్ షూటర్స్ చంద్రో తోమర్, ప్రకాశి తోమర్ జీవిత గాథ ఆధారంగా చిత్రీకరించారు. వీరి పాత్రల్లో తాప్సీ పన్ను, భూని పెడ్నేకర్ నటిస్తున్నారు. ఈ మూవీకి తుషార్ హీరానందని దర్శకత్వం వహించగా అనురాగ్ కశ్యప్ నిర్మించారు. తన సినీ కెరీరర్‌లో తొలిసారిగా తాప్సీ 60 ఏళ్ల పాత్రలో నటించారు. యూపీలోని మీరట్, బాగ్పట్ సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశామని.. షార్ప్ షూటర్స్ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని నటించామని తాప్సీ తెలిపింది. కాగా, అక్టోబరు 25న సాండ్ కీ ఆంఖ్ చిత్రం విడుదల కానుంది.

First published: October 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>