‘ఉరీ' సినిమాను మెచ్చుకున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Photo: Twitter

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు. ఆ తర్వాత.. ఆయన ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకున్నారు. 

  • Share this:
    ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హింది సినిమా ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ను ప్రత్యేకంగా వీక్షించారు. ఆ తర్వాత.. ఆయన ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకున్నారు.  ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ సినిమా స్ఫూర్తిదాయకంగా ఉందని..‘న్యూడిల్లీలోని ఉప రాష్ట్రపతి భవనానికి భద్రతగా ఉండే ఇండో-టిబెటన్‌ సరిహద్దు పోలీసులతో కలిసి ‘ఉరీ’ సినిమాను చూడటం చాలా సంతోషంగా ఉందని పేర్కోన్నారు. ‘ఉరీ’ చిత్ర బృందానికి  శుభాకాంక్షలు తెలుపుతూ.. సినిమా చూస్తుండగా..తీసిన ఫొటోలను పోస్ట్ చేశారు. మరో పక్క ‘ఉరీ’ సినిమాకు  ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో పన్ను మినహాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.  భారత సైన్యం పాకిస్థాన్‌పై చేపట్టిన మెరుపు దాడుల ఆధారంగా  తీసిన ‘ఉరీ’ చిత్రంలో నటుడు విక్కీ కౌశల్‌, యామీ గౌతమ్ ప్రధాన  పాత్రలో నటించారు. ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం  జనవరి 11న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి  విజయాన్ని అందుకుంది.


    Photos: పాయల్ రాజ్‌పుత్ లేటెస్ట్ ఫోటోస్..
    First published: