వీరసావర్కర్ జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు....ఉపరాష్ట్రపతి ఆవేదన

కొందరు కావాలని పక్షపాత వైఖరితోనే సావర్కర్‌పై బురదజల్లుతున్నారని ఆయన అన్నారు. సావర్కర్‌ను అండమాన్ జైలులో పదేళ్లు నిర్బంధించారని వెంకయ్యనాయుడు అన్నారు. సావర్కర్ చరిత్ర తెలుసుకోకుండా కొందరు ఆయన ప్రతిష్టను మసకబారేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

news18-telugu
Updated: January 23, 2020, 10:56 PM IST
వీరసావర్కర్ జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు....ఉపరాష్ట్రపతి ఆవేదన
వెంకయ్య నాయుడు(File)
  • Share this:
వీర సావర్కర్ చరిత్రను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలని పక్షపాత వైఖరితోనే సావర్కర్‌పై బురదజల్లుతున్నారని ఆయన అన్నారు. సావర్కర్‌ను అండమాన్ జైలులో పదేళ్లు నిర్బంధించారని వెంకయ్యనాయుడు అన్నారు. సావర్కర్ చరిత్ర తెలుసుకోకుండా కొందరు ఆయన ప్రతిష్టను మసకబారేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వీర్ సావర్కర్ జీవితం గురించి అధ్యయనం చేయాలని ఉప రాష్ట్రపతి సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, వీర్ సావర్కర్, సుభాష్ చంద్రబోస్ వంటి వారి కథలను పాఠ్యాపుస్తకాల్లో పొందుపరచాలని వెంకయ్య అభిప్రాయపడ్డారు.
Published by: Krishna Adithya
First published: January 23, 2020, 10:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading