నేతల భాషలో మార్పు రావాలి... రాద్ధాంతం పెరిగిపోయింది: వెంకయ్యనాయుడు

రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం పెరిగిపోయిందని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు కేవలం విధానాలకే పరిమితం కావాలని సూచించారు.

news18-telugu
Updated: October 7, 2018, 8:57 PM IST
నేతల భాషలో మార్పు రావాలి... రాద్ధాంతం పెరిగిపోయింది: వెంకయ్యనాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశం మొత్తం మీద రాజకీయ నేతల భాషలో మార్పు రావాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరులో జరిగిన డాక్టర్ రామినేని ఫౌండేషన్ 19వ వార్షికోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులమత ప్రాంతాల పేరుతో వివక్ష చూపించేవారు భారతీయులు కారు అని స్పష్టం చేసిన వెంకయ్య... ఇప్పటి నాయకుల విమర్శలు, ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో సిద్ధాంతం తగ్గిపోయి రాద్ధాంతం పెరిగిపోయిందని తనదైన శైలిలో నేతలకు చురకలు అంటించారు. నాయకులు అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. నేతలు ప్రజాస్వామ్యస్పూర్తిని, విలువలను కాపాడాలని అన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు కేవలం విధానాలకే పరిమితం కావాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య తిట్ల పురాణం హద్దుల దాటుతున్న నేపథ్యంలో వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: October 7, 2018, 8:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading