హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Venkaiah Naidu Tears : రాజ్యసభలో కన్నీళ్లు పెట్టుకున్న వెంకయ్య..మోదీ ఉద్వేగ ప్రసంగం!

Venkaiah Naidu Tears : రాజ్యసభలో కన్నీళ్లు పెట్టుకున్న వెంకయ్య..మోదీ ఉద్వేగ ప్రసంగం!

రాజ్యసభలో కన్నీళ్లు పెట్టుకున్న వెంకయ్య నాయుడు

రాజ్యసభలో కన్నీళ్లు పెట్టుకున్న వెంకయ్య నాయుడు

Modi Praises Venkaiah Naidu :  రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య నాయుడు భావోద్వేగ ప్ర‌సంగం చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో యుగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు.. రాజ్యసభ చైర్మన్, ఉప రాష్ట్రపతి హోదాలో తన చివరి ప్రసంగం చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Modi Praises Venkaiah Naidu :  రాజ్య‌స‌భ‌(Rajya Sabha)లో వెంక‌య్య నాయుడు భావోద్వేగ ప్ర‌సంగం చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు పదవీకాలం ఈ నెల 10వ తేదీతో యుగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు.. రాజ్యసభ చైర్మన్(Rajya Sabha Chairman), ఉప రాష్ట్రపతి(Vice President) హోదాలో తన చివరి ప్రసంగం చేశారు. ప్రపంచం మొత్తం భారతదేశాన్ని చూస్తోందని.. ఎగువ సభ మరింత గొప్ప బాధ్యతను కలిగి ఉందని అన్నారు. ఎంపీలు సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. సభలో నిర్మాణాత్మక చర్చలు జరగాలని ఆకాక్షించారు. ప్ర‌జాస్వామ్యం గౌర‌వం మ‌రింత పెరిగేలా న‌డుచుకోవాల‌ని సూచించారు. స‌భ‌లో మాట్లాడే భాష‌కు కూడా అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. తొలి ప్రాధాన్యం మాతృభాష‌కు, త‌ర్వాత సోద‌ర భాష‌కు ఇవ్వాల‌న్నారు. స‌భ‌లో మాతృభాష‌లో మాట్లాడ‌టాన్ని ప్రోత్స‌హించాను అని చెప్పారు.

" సభ నిర్వహణకు నా వంతు కృషి చేశాను. నేను దక్షిణం, ఉత్తరం, తూర్పు, పశ్చిమం, ఈశాన్యం.. అన్ని వైపుల వారికి అవకాశం కల్పించడానికి ప్రయత్నించాను. మీలో ప్రతి ఒక్కరికి సమయం ఇవ్వడింది. స‌భ గౌర‌వం కాపాడేందుకు కొన్నిసార్లు క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాను. స‌భ‌లో ఎవ‌రూ శ‌త్రువులు ఉండ‌రు.. ప్ర‌త్య‌ర్థులే ఉంటారు. పోటీలో ఇతరులను మించిపోవడానికి మనం కష్టపడి పని చేయాలి. కానీ ఇతరులను తగ్గించకూడదు. పార్లమెంటు సజావుగా సాగాలని నా కోరిక... మీ ప్రేమ, ఆప్యాయతలకు నేను చలించాను. నేను కృతజ్ఞతలు తెలపుతున్నాను" అని వెంకయ్య నాయుడు అన్నారు.

Kim Jong UN : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోకి కిమ్ ఎంట్రీ..ఇక వార్ వన్ సైడే!

అలాగే ఉప రాష్ట్రపతి పదవి ఎంపికవుతున్నాని ప్రధాని మోదీ తనకు ఐదేళ్ల క్రితం చెప్పినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నాని ఈ సందర్భంగా వెంకయ్య గుర్తుచేసుకున్నారు. "నేను భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికవుతున్నానని ప్రధాని చెప్పిన రోజు.. నేను కన్నీళ్లు పెట్టుకున్నాను. దాని గురించి నేను అడగలేదు. పార్టీ ఆదేశాన్ని ఇచ్చింది.. నేను బాధ్యత వహించి పార్టీకి రాజీనామా చేశాను. నేను పార్టీని వీడాల్సి వచ్చినందుకు కన్నీళ్లు వచ్చాయి. బాధ‌తోనే బీజేపీకి రాజీనామా చేశాన‌ని వెంక‌య్య నాయుడు గుర్తు చేసుకుని, భావోద్వేగానికి లోన‌య్యారు".

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీడ్కోలు చర్చలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ఉద్వేగానికి లోనయ్యారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి ప్రధాని అభినందనలు తెలిపారు. వెంకయ్యనాయుడు అత్యంత జనాదరణ ఉన్న నాయకుడని, అనేక బాధ్యతలను వెంకయ్య సమర్థంగా నిర్వహించారని ప్రధాని మోదీ కొనియాడారు. ఆ సందర్భంగా వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టారు. పదవులకే వెంకయ్య వన్నె తెచ్చారని ప్రధాని మోడీ అన్నారు. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, ఉప రాష్ట్రపతిగా ఆయన అత్యంత సమర్థవంతంగా పని చేశారని చెప్పారు. . తన పనితీరుతో రాజ్యసభ గౌరవాన్నిపెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని చెప్పారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని మోడీ కొనియాడారు. పాత తరం నాయకులతో పాటు కొత్త తరానికి వెంకయ్య నాయుడు అనుసంధానమయ్యారని తెలిపారు. యువ ఎంపీలను ఆయన ప్రోత్సహించారని చెప్పారు.వెంకయ్యతో కలిసి పనిచేసే అదృష్టం తనకు లభించిందని ప్రధాని మోడీ అన్నారు. వెంకయ్య నాయుడు పనితీరు అందరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు ప్రధాని మోడీ. వెంకయ్య నాయుడు నుంచి సమాజం, ప్రజాస్వామ్యం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు. ప్రజలతో మమేకయ్యే భాష ఆయన సొంతమన్నారు. ప్రజలకు సులభంగా అర్దమయ్యేలా వెంకయ్య చెబుతారని మోదీ తెలిపారు. ఇక,శనివారం జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధనకర్ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి(Vice President Of India)గా 11వ తేదీన జగదీప్ ధనకర్(Jagdeep Dhankhar) ప్రమాణస్వీకారం చేయనున్నారు

First published:

Tags: Pm modi, Rajyasabha, Venkaiah Naidu, Vice President of India

ఉత్తమ కథలు