కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వెటరన్ నేత పండిట్ సుఖ్ రామ్ (Former Union minister Pandit Sukh Ram) ఇకలేరు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. 94 ఏళ్ల సుఖ్ రామ్ కు ఈనెల 4న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబీకులు ఆయనను హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు.
మాజీ మంత్రి సుఖ్ రామ్ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేశారు. సుఖ్ రామ్ మరణంపై కాంగ్రెస్ నేతలు పలువురు సంతాపం తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి సుఖ్రామ్ మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1993-1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1963 నుంచి 1984 వరకు మండి ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలుపొందారు. రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిగా పనిచేశారు. 1984లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.