హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Viral Video: ఈ కుండను తయారు చేసిన వారికి పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వాలి..? ఎన్నిసార్లు కొట్టినా పగల్లేదే... వైరల్ వీడియో

Viral Video: ఈ కుండను తయారు చేసిన వారికి పెద్ద కాంట్రాక్ట్ ఇవ్వాలి..? ఎన్నిసార్లు కొట్టినా పగల్లేదే... వైరల్ వీడియో

ఉట్టి కొట్టినా పగలని కుండ

ఉట్టి కొట్టినా పగలని కుండ

Strong Matki: సాధారణంగా మట్టికుండకు ఏం తగిలినా వెంటనే ముక్కలు అవుతుంది. ఇక పగలగొట్టేందుకు ప్రయత్నిస్తే ముక్కలు అవ్వాలి.. కానీ ఈ కుండ మాత్రం వెరీ స్పెషల్.. ఏంటో ఆ స్పెషల్ మీరే చూడండి.

Who Made This Matki: మనదేశంలో పెద్ద పెద్ద వంతనెలు, బ్రిడ్జ్ లు, ఫ్లై ఓవర్లు.. బిల్డింగ్ లు.. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చినా చాలా చోట్ల కూలిపోతూ ఉంటాయి. నిర్మాణంలో ఉండగా కూలాయి అంటూ తరచూ వార్తలు వింటూంటా.. అయితే అలా అవి కూలి పోకుండా ఉండాలి అంటే ఈ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉంది అంటే.. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా.. ఉట్లను కొట్టి వేడుకలు చేసుకోవడం చాలామందికి ఆనవాయితీ.. బాగా ఎత్తైన ప్రదేశంలో కుండను కడుతారు. దీనిని కొట్టడానికి యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి..ఆ కుండను కొబ్బరి కాయ లేదా ఇతరత్రా వాటితో కొడుతూ సంబరాలు చేసుకుంటుంటారు. ఇది అన్నీ చోట్ల సర్వ సాధారణంగా జరిగిదే. అయితే ఓ ప్రాంతంలో కుండను పగులగొట్టడానికి ఇధ్దరు యువకులు తెగ కష్టపడ్డారు. ఆ కుండని పగలగొట్టేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి రాయితో కొట్టినా..ఆ కుండ పగులలేదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ..ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

కృష్ణాష్టమి సందర్భంగా..ఓ ప్రాంతంలో ఓ చోట ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. యువకులు ఒకరిపై ఒకరు ఎక్కి.. కుండను పగులగొట్టే ప్రయత్నం చేశారు. అక్కడున్న వారిని ప్రోత్సాహిస్తున్నారు. కానీ..ఓ యువకుడు కుండను పగులగొట్ట లేకపోయాడు. కుండను పగులగొట్టేందుకు మరో యువకుడు వచ్చాడు. నేను పగులగొడుతాననే బిల్డప్ లో వచ్చాడు. కుండను పట్టుకుని ఓ దెబ్బ వేశాడు. పగుల్లేదు. మరొక దెబ్బ వేశాడు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కుండ మాత్రం పగల్లేదు..

కుండ పగలకపోవడంతో.. ఆ యువకుల్లో కసి పెరిగిపోయింది. దబా..దబా అంటూ..దెబ్బలు వేశారు. అయిన కొద్దిగా కూడా పగులు రాలేదు ఆ కుండకు. దీంతో కామ్ దేవ్ బాబా అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎవరు తయారు చేశారో ఏమో, ఫేవికాల్ పెట్టాడా ? అంటూ సరదా సరదా కామెంట్స్ చేస్తున్నారు. దేశంలో రోడ్లు, బ్రిడ్జిల కాంట్రాక్టులు ఇతడికి ఇవ్వాలి అంటూ ట్వీట్ చేశారు.http://


కామ్ దేవ్ బాబా పెట్టిన ఈ పోస్టు క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంతా అసలు కుండ ఎందుకు పగల్లేదు అని చచ్చించుకుంటున్నారు. పెద్ద రాయితో కొడితే ఇత్తడి, స్టీల్ గిన్నెలే చిదికిపోతున్నాయి.. మరి మట్టి కుంబ ఎందుకు చితకలేదని చర్చించుకుంటున్నారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి.. ఇదంతా దేవుడి మహిమ అంటున్నారు.

First published:

Tags: God srikrishna, India, National News

ఉత్తమ కథలు