Home /News /national /

VENU PRASAD APPOINTED ADDITIONAL CHIEF SECRETARY TO PUNJAB CM BHAGWANT MANN THE IAS HAILS FROM TELANGANA SURYAPET MKS

Venu Prasad: తెలుగు అధికారికే తొలి పోస్ట్: పంజాబ్ కొత్త సీఎం అదనపు సీఎస్‌గా వేణు ప్రసాద్

సీఎం మాన్, ఐఏఎస్ వేణు ప్రసాద్

సీఎం మాన్, ఐఏఎస్ వేణు ప్రసాద్

పరిపాలనకు సంబంధించి పంజాబ్ కాబోయే సీఎం మాన్ తీసుకున్న తొలి నిర్ణయం తెలుగు అధికారికి సంబంధించింది కావడం గమనార్హం. అరిబండి వేణుప్రసాద్ పంజాబ్ సీఎంకు అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీ సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది ఆమ్ ఆద్మీ పార్టీ. ఓటమి క్రమంలో సీఎం పదవికి చరణ్ జిత్ సింగ్ చన్నీ శుక్రవారం రాజీనామా చేయడంతో కాబోయే సీఎం భగవంత్ మాన్ శనివారం నుంచే కీలక నిర్ణయాలను వెలువరిస్తున్నారు. పరిపాలనకు సంబంధించి సీఎం మాన్ తీసుకున్న తొలి నిర్ణయం తెలుగు అధికారికి సంబంధించింది కావడం గమనార్హం. తెలంగాణకు చెందిన పంజాబ్ కేడర్ ఐఏఎస్ అరిబండి వేణుప్రసాద్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు అదనపు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సీఎంగా ఎన్నికైన తర్వాత మాన్ ఆదేశాలమేరకు జరిగిన తొలి నియామకం ఇదే. అంతేకాదు, చీఫ్ సెక్రటరీ రేసులోనూ వేణు ప్రసాద్ పేరు వినిపిస్తోంది..

తాజాగా పంజాబ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో మొత్తం 117 సీట్లకుగానూ ఆప్ ఏకంగా 92 స్థానాలను గెలుచుకోవడం తెలిసిందే. పార్టీ ముందే ప్రకటించినట్లుగా భగవంత్ మాన్ సీఎం కాబోతున్నారు. మార్చి 16న(బుధవారం) భగత్ సింగ్ స్వగ్రామమైన ఖేత్కర్ కలాన్లో భగవంత్ మాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, పాత సీఎం రాజీనామాతో కాబోయే సీఎం మాన్ శనివారం నుంచే ఆదేశాలను జారీ చేయడం మొదలుపెట్టారు. తనకు అదనపు సీఎస్ గా తెలుగు అధికారిని నియమించుకున్న మాన్.. సీఎస్ ఎంపిక, ఇతర అధికారుల బదిలీలపైనా ఫోకస్ పెట్టారు.

KCRకు షాకిచ్చిన దేవేగౌడ! -బీజేపీ వ్యతిరేక జాతీయ కూటమి కష్టమే -2సార్లు విఫలమయ్యానన్న మాజీ ప్రధాని


ప్రస్తుత పంజాబ్ ప్రభుత్వ కార్యదర్శి అనిరుద్ తివారి, డీజీపీ వీకే భవ్రాలతో కాబోయే సీఎం మాన్ భేటీ అయ్యారు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత మాన్.. సీఎస్ ను మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీఎస్ రేసులో 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు వీకే సింగ్, అనురాగ్ అగర్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 1991 కేడర్ ఐఏఎస్ అధికారి వేణుప్రసాద్ పేరు కూడా సీఎస్ రేసులో వినిపించింది. అయితే ప్రస్తుతానికి ఆయనను అదనపు సీఎంగా నియమించుకున్నది రాబోయే రోజుల్లో సీఎస్ గా చేసేందుకేననే వాదన వినిపిస్తోంది.

దక్షిణాదిలో ఆప్ తొలి టార్గెట్ తెలంగాణే.. ఇదీ ప్రణాళిక : పంజాబ్‌లో వీఐపీలకు సామాన్యుడి షాక్


తెలంగాణకు చెందిన అరిబండి వేణుప్రసాద్ స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరెడుచర్ల మండలంలోని పెంచికల్‌దిన్నె. వేణుప్రసాద్ తల్లిదండ్రులు అరిబండి రంగయ్య, మంగమ్మలు. ఈయన ప్రాథమిక విద్య మునగాలలో, పదవ తరగతి ఖమ్మంలో, ఇంటర్ నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాలలో చదివి.. 1980లో బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఎజిబిఎస్సీ చేశారు. 1991లో సివిల్స్ రాసి పంజాబ్ కేడర్ లో నియమితులయ్యారు. ప్రస్తుతం పంజాబ్ విద్యుత్ సంస్థ సీఎండీగా, ఆ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు అదనపు సీఎస్ గా పనిచేస్తున్నారు. తాజాగా సీఎంకు అదనపు సీఎస్ గానూ నియమితులయ్యారు.
Published by:Madhu Kota
First published:

Tags: AAP, Assembly Election 2022, Punjab

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు