Venkaiah Naidu: సభలో వీడియోలు తీయొద్దు.. ఎంపీలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య వార్నింగ్

వెంకయ్య నాయుడు (ఫైల్ ఫొటో)

చట్ట సభల కార్యకాలాపాలను వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడం సభా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. సభ నియమాలను పాటించి చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందని ఆయన అన్నారు.

  • Share this:
    కొత్త వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో రచ్చ జరుగుతోంది. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభలను విపక్ష సభ్యులు స్తంభింపజేస్తున్నారు. వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. రాజ్యసభలో ఛైర్మన్, లోక్‌సభలో స్పీకర్ ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. అంతేకాదు మంగళవారం పలువురు సభ్యులు రాజ్యసభలో వీడియోలు తీశారు. విపక్ష సభ్యుల ఆందోళలను రికార్డ్ చేశారు. ఆ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాతో పలు టీవీ ఛానెళ్లలోనూ ప్రసారమయ్యాయి. ఈ క్రమంలో ఎంపీ తీరుపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఎంపీలెవరూ మొబైల్ పోన్లతో వీడియోలు తీయవద్దని హెచ్చరించారు.

    చట్ట సభల కార్యకాలాపాలను వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో చిత్రీకరించడం సభా నిబంధనలను ఉల్లంఘన కిందకు వస్తుందని వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. సభ నియమాలను పాటించి చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎంపీలందరిపైనా ఉందని ఆయన అన్నారు. మొబైల్‌లో చిత్రీకరించిన వీడియోలు టీవీల్లోనూ ప్రసారం కావడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి అధికారిక వీడియోలు కానందున.. ఎవరూ ప్రసారం చేయకూడదని మీడియా సంస్థలకు కూడా వెంకయ్యనాయుడు విజ్ఞప్తిచేశారు.

    ''చట్ట సభల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం నిషిద్ధమని ఎంపీలకు తెలుసు. ఐనప్పటికీ కొందరు సభ్యులు ఉద్దేశ్యపూర్వకంగా సభా కార్యకలాపాలలకు కెమెరాల్లో చిత్రీకరిస్తున్నారు. అలాంటి చర్యలతో సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారు. ఎంపీలెవరు తమకు అధికారము లేని ఇలాంటి పనులను చాంబర్‌లో చేయకూడదు. సభా వ్యవహారాలను మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించడం, అవి సోషల్ మీడియాలో ప్రసారమవడం సభా నియామల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇలాంటి చర్యల వల్ల సభా గౌరవానికి భంగం వాటిల్లుతుంది. ఈ విషయంలో సభ్యులంతా జాగ్రత్తతో వ్యవహరంచాలి.'' అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: