Home /News /national /

VEHICLE CARRYING LIQUOR WORTH RS 10 LAKH OVERTURNED ON MADURAI HIGHWAY COMMUTERS LOOT BOTTLES SK

Liquor on Road: రోడ్డుపై మద్యం సీసాలు.. దొరికినోడికి దొరికనంత.. ఎగబడిమరీ ఎత్తుకెళ్లారు

రోడ్డుపై లిక్కర్ లారీ బోల్తా

రోడ్డుపై లిక్కర్ లారీ బోల్తా

Liquor Lorry Accident: ట్రక్కు బోల్తా పడింది.. డ్రైవర్‌కి ఏమైనా గాయాలయ్యాయా? ఆస్పత్రికి తరలిద్దామన్న ఆలోచనే ఎవరికీ లేదు. వారి దృష్టంతా మద్యం బాటిళ్లపైనే ఉంది. ఇంతకంటే బంపర్ ఆఫర్ మళ్లీ రాదని.. బాటిళ్లకు బాటిళ్లు పట్టుకెళ్లారు.

    జనంతో కిటకిటలాడే షాపు ఏదైనా ఉందా అంటే అది మద్యం దుకాణమే. అన్ని కాలాల్లోనూ.. అన్ని పరిస్థితుల్లోనూ.. వైన్ షాప్‌లు మందు బాబులతో కళకళలాడుతుంటాయి. రేటు పెరిగినా.. డోంట్ కేర్..! పెట్రోల్ రేటు రూపాయి పెరిగితే గగ్గోలు పెడతారేమో గానీ.. మద్యం ధర రూ.50 పెరిగినా.. పట్టించుకోరు. ఎగబడి మరీ కొంటారు. తగ్గేదే లేద.. అని తాగేస్తుంటారు. మరి అలాంటోళ్లు .. ఫ్రీగా మద్యం దొరికితే వదిలిపెడతారా? తమిళనాడులోని మధురైలో కూడా కొందరికి ఉచితంగా మద్యం దొరికింది. రోడ్డుపై బాటిళ్లు కనిపించడంతో ఎగబడి మరీ ఎత్తుకెళ్లారు. దొరికినోడికి దొరికినంత పట్టుకెళ్లారు. రోడ్డుపై మద్యం బాటిళ్లు దొరకడమేంటని అనుకుంటున్నారా? వాస్తవానికి అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా (Liquor lorry overturned) పడింది. అందులో నుంచి సీసాలు పడిపోవడడంతో.. మందు బాబులు పండగ చేసుకున్నారు.

    OMG: ఆ ఊర్లో అబ్బాయిలు పుట్టరు.. అందరికీ ఆడపిల్లలే.. ఏంటీ మిస్టరీ?

    బుధవారం తమిళనాడు (Tamilnadu)లోని మధురై హైవేపై మద్యం లోడుతో వెళ్తున్న మినీ లారీ బోల్తా (Liquor carrying van accident) పడింది. అందులో ఉన్న లిక్కర్ కార్టన్స్ మొత్తం రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు వాటిని చూసి వెంటనే తమ వాహనాలను ఆపారు. రోడ్డుపై పడిన మద్యం బాటిళ్లను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. ట్రక్కు బోల్తా పడింది.. డ్రైవర్‌కి ఏమైనా గాయాలయ్యాయా? ఆస్పత్రికి తరలిద్దామన్న ఆలోచనే ఎవరికీ లేదు. వారి దృష్టంతా మద్యం బాటిళ్లపైనే ఉంది. ఇంతకంటే బంపర్ ఆఫర్ మళ్లీ రాదని.. బాటిళ్లకు బాటిళ్లు పట్టుకెళ్లారు. కొందరైతే పెట్టెలనే ఎత్తుకెళ్తూ కనిపించారు. ఈ ఘటనతో హైవేపే భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కబెట్టారు. కానీ అప్పటికే బాటిళ్లన్నీ మాయం అయ్యాయి. అక్కడక్కడా పగిలిపోయి ముక్కలు తప్ప.. బాగున్న బాటిల్స్ మొత్తాన్ని జనాలు తీసుకెళ్లిపోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    OMG: ఆ ఊర్లో అబ్బాయిలు పుట్టరు.. అందరికీ ఆడపిల్లలే.. ఏంటీ మిస్టరీ?



    కేరళలోని మనలూర్‌లో ఉన్న లిక్కర్ డిపో నుంచి మద్యం బాటిళ్లను తమిళనాడుకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అగి వేగం కారణంగా వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. ట్రక్కులో మొత్తం 10 లక్షల విలువైన మద్యం ఉందని.. అదంతా భూమి పాలయిందని డ్రైవర్ వాపోయారు. రోడ్డుపై పడిన మద్యం బాటిళ్లను వాహనదారులు ఎత్తుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు.. అదృష్టమంటే మీదే అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ఇది మరీ దారుణం.. రోడ్డు ప్రమాదానికి గురైన డ్రైవర్‌ని పట్టించుకోకుండా.. మద్యం కోసం ఎగబడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఏప్రిల్ 20న మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రోడ్డుపై మద్యం లారీ బోల్తాపడడంతో లిక్కర్ బాటిళ్లను స్థానికులు ఎత్తుకెళ్లారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Liquor, Tamilnadu, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు