హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vegetables: 18 కిలోల గుమ్మడి... 15 కిలోల సొరకాయ... పండించిన రైతు..!

Vegetables: 18 కిలోల గుమ్మడి... 15 కిలోల సొరకాయ... పండించిన రైతు..!

భారీ గుమ్మడి కాయ

భారీ గుమ్మడి కాయ

చాలా సంవత్సరాలుగా సొంతంగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. సేంద్రియ ఎరువులు , దేశీ గోవర్ వర్మి కంపోస్ట్ జోడించడం ద్వారా ఇలాంటి కూరగాయల్ని పండించవచ్చన్నాడు.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం చాలామంది వ్యవసాయంపై ఆసక్తి చూపిస్తున్నారు. కొత్త కొత్త తరహాల్లో కొత్త రకంగా పంటల్ని, కూరగాయాల్ని పండిస్తున్నారు. అయితే మీరు ఎప్పుడైనా... పేద్ద గుమ్మడికాయ.. ఆనపకాయను చూశారు. పెద్దది అంటే చాలా పెద్దది. దాదాపు 18 కేజీల గుమ్మడికాయ.. 15 కేజీల సొరకాయను ఎప్పుడైనా చూశారా? అయితే రైతు ఇలాంటి భారీ కూరగయాల్ని పండించాడు. రైతు దీపు కుమార్ సింగ్ తన వ్యవసాయ విధానం, సేంద్రియ ఎరువులతో ఇటువంటి అనేక కూరగాయలను ఉత్పత్తి చేస్తున్నాడు. దీనికి అతను చాలా ప్రసిద్ధి చెందాడు. సేంద్రియ ఉత్పత్తితో 23 కిలోల బరువున్న కూరగాయలను ఉత్పత్తి చేస్తూ పేరు తెచ్చుకుంటున్నామని రైతు దీపు చెబుతున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన జీవితంలో తొలిసారిగా సొరకాయ, గుమ్మడికాయ ఇంత బరువు, పరిమాణంలో ఉండటం చూసి ఆశ్చర్యపోయానని. అన్నాడు. ఎవరైనా సరే వ్యవసాయంలో మెలకువలు కావాలంటే తనను అడిగి తెలుసుకోవచ్చని అన్నారు. రైతు తాను పండించిన కూరగాయల్ని... సేంద్రియ ఉత్పత్తులను ప్రాంతీయ స్థాయి వ్యవసాయ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు తనను ఉద్యానవన శాఖ ఆహ్వానించిందని కతిహార్ జిల్లా మణిహరికి చెందిన రైతు దీపు కుమార్ సింగ్ న్యూస్ 18 లోకల్‌తో తెలిపారు. అప్పుడే రైతు తన సేంద్రియ ఉత్పత్తులైన 18 కిలోల గుమ్మడికాయ. 15 కిలోల ఆనపకాయతో ఎగ్జిబిషన్‌కు చేరుకున్నాడు. దీంతో అక్కడున్న రైతులంతా.. అతను పండించిన కూరగాయలను చూడటానికి ఒక్కసారిగా పోటెత్తారు.

గుమ్మడి 18 కిలోలు అని రైతులు చెబుతున్నారు. అయితే వీటికన్న పెద్ద గుమ్మడికాయలు కూడా కాచాయని తెలిపాడు రైతు. అయితే వాటిని పొలంలోనే వదిలేశామన్నారు. ఇలా పెద్ద కూరగాయలను పండించడానికి దాదాపు 5 నుంచి 6 నెలల సమయం పట్టిందని తెలిపాడు. వీటికన్న పెద్దవైన గుమ్మడికాయల్ని పొలంలోనే... వదిలేశానని.. కానీ దాని పొదను మాత్రం తొలగించలేదని.. ఎండుతున్న ఆకుల్ని మాత్రం తొలగిస్తూ వచ్చానని రైతన్న తెలిపాడు. చాలా సంవత్సరాలుగా నా స్వంత సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

సేంద్రియ ఎరువులు , దేశీ గోవర్ వర్మి కంపోస్ట్ జోడించడం ద్వారా ఇలాంటి కూరగాయల్ని పండించవచ్చన్నాడు. మీరు అటువంటి పంటను ఉత్పత్తి చేసే వ్యవసాయం చేయాలని ఇతరరైతులకు పిలుపు నిచ్చాడు. అప్పుడే మీరు పండించిన పంటకు కూడా పేరుస్తుందని... మీ ఉద్యానవన శాఖకు కూడా మీ పేరు తెలుస్తుందని చెప్పాడు. అలాగే ఇతర రైతులు అన్నదాతలు కూడా ఏ విషయమైనా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని.. పంచాయతీ స్థాయి, జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయిలో ఎప్పటికప్పుడు తమకు తెలిసిన సమాచారం తెలియజేస్తూ. సలహాలు సూచనలు చేయాలని ఈ యువరైతు కోరాడు.

First published:

Tags: Bihar, Farmer

ఉత్తమ కథలు