VARIETY LOVE STORY WIDOW FELL IN LOVE WITH BROTHER FAMILY MEMBERS OBJECTS THEIR LOVE IN PANCHAYAT LATER POLICE ENTERS INTO THE SCENE SK
తమ్ముడితో అక్క ప్రేమాయణం.. భర్త చనిపోయాక అతడే సర్వస్వం.. త్వరలో పెళ్లి.. ఈ సమాజం ఒప్పుకుంటుందా..?
ప్రతీకాత్మక చిత్రం
ఏడాది క్రితం భర్త మరణించాడు. అప్పటి నుంచి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే తన తమ్ముడితో ప్రేమలో పడింది. వీరిద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారంటే.. ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు.
ప్రేమకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు. రెండు మనసులు కలిస్తే చాలు. జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉంటారన్న నమ్మకం ఉంటే చాలు. ఇలాగే బీహార్‌లో ఓ జంట ప్రేమించుకుంది. ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసి.. గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టారు. వారు ప్రేమించుకుంటే.. వీళ్లకేం ఇబ్బంది అని అనిపించవచ్చు. కానీ వీరిది అందరిలాంటి ప్రేమ కాదు. అక్కాతమ్ముళ్ల బంధమే.. ఇప్పుడు ప్రేమ బంధంగా మారింది. తమ్ముడితో అతడి అక్క ప్రేమలో పడింది. భర్త చనిపోయాక.. తమ్ముడే సర్వస్వంగా బతుకుతుంది. అతడినే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతోంది. కానీ అందుకు ఈ సమాజం ఒప్పుకోవడం లేదు. ప్రేమ పేరుతో బరి తెగించారని అంటోంది. వెస్ట్ చంపరాన్ జిల్లాలో వెలుగు చూసిన ఈ వింత ప్రేమ కథ.. ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం..వెస్ట్ చంపారన్ జిల్లా బెట్టియాలోని బానుచాపర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు ప్రేమించుకున్నారు. ఐతే వారిద్దరు వరుసకు అక్కాతమ్ముళ్లు అవుతారు. తన చిన్నాన్న కొడుకునే ఆమె ప్రేమించింది. అంతేకాదు తన కంటే అతడు నాలుగేళ్లు చిన్నవాడు. మరో ఆసక్తికర విషయమేమిటంటే.. ఆమెకు ఇంతకు ముందే పెళ్లయింది. కానీ ఏడాది క్రితం భర్త మరణించాడు. అప్పటి నుంచి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే తన తమ్ముడితో ప్రేమలో పడింది. వీరిద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకుంటున్నారంటే.. ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసుండాలని అనుకుంటున్నారు. కానీ ఈ విషయం ఇంట్లో తెలిసి.. గొడవ జరిగింది. మీరిద్దరు అక్కాతమ్ముళ్లవుతారు.. ఇలా చేయడానికి సిగ్గులేదా? అని తిట్టిపారేశారు. కానీ వారు మాత్రం వినలేదు. చావనైనా చస్తాం గానీ.. మమ్మల్ని మీరు విడదీయలేరు అని తెగేసి చెప్పారు.
వీరి వ్యవహారం చివరకు పంచాయతీ వరకు వెళ్లింది. గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడి.. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు భావించారు. గ్రామ పెద్దలు కూడా అక్కాతమ్ముళ్ల తీరుపై గుర్రుగా ఉన్నారు. ప్రేమ పేరుతో ఇంత నీచగానికి దిగుతారుతారా? అని కోపంతో ఉన్నారు. ఊరందరి సమక్షంలో కడిగిపారేసి.. శిక్ష విధించాలని అనుకున్నారు. గుండుకొట్టి.. ఊరంతా ఊరేగిద్దామని భావించారు. కానీ అప్పటికే ఆ ప్రేమికులు అప్రమత్తమయ్యారు. పంచాయితీ గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారు పంచాయితీ జరుగుతున్న సమయంలోనే గ్రామానికి చేరుకొని ఊరి జనంతో మాట్లాడారు. ఈ సమాజంలో ప్రేమించుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని.. వారిని విడదీయకూడదని చెప్పారు.
తమకు బంధువులు, గ్రామస్తుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆ జంట కోరింది. అనంతరం సెక్యూరిటీ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల జోక్యంతో గ్రామస్తుల వేధింపుల నుంచి వారికి విముక్తి లభించింది. పెళ్లి చేసుకోవడం అనేది వ్యక్తిగత ఇష్టమని, ఇందులో తప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే తాము పెళ్లి చేసుకుంటామని.. తమను ఎవ్వరూ విడదీయలేరని చెబుతున్నారు. కాగా, ఆమె భర్త గత ఏడాది నదిలో పడి మరణించాడు. అప్పటి నుంచి తమ్ముడిని ప్రేమిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.