విరసం నేత వరవరరావు ఆస్పత్రికి తరలింపు..

కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

news18-telugu
Updated: July 14, 2020, 9:05 AM IST
విరసం నేత వరవరరావు ఆస్పత్రికి తరలింపు..
వరవరరావు
  • Share this:
ముంబైలోని జైలులో ఉన్న విరసం నేత వరవరరావును నవీ ముంబైలోని జేజే ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వరవరరావు కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి వెల్లడించారు. పరీక్షల అనంతరం ఆస్పత్రిలో చేర్పిస్తారా ? లేదా ? అని అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికించారని... ఆయనను అమానుషంగా జైలులో నిర్బంధించిందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాత్కాలిక బెయిల్‌ కోసం వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతోపాటు తన ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్న దృష్ట్యా బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన కోరారు. వరవరరావుకు బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరిస్తూ జూన్‌ 26న ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక పిటిషన్, వరవరరావు మెడికల్‌ రికార్డులను అందజేసేలా నవీ ముంబైలోని తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరుతూ మరో పిటిషన్‌ వేశారు. దీంతో కొంతకాలం నుంచి ముంబై జైలులో ఉంటున్న వరవరరావుకు ఈసారైనా బెయిల్ వస్తుందా ? లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: July 14, 2020, 9:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading