VARANASI GYANVAPI MASJID SHIVLING ROW SUPREME COURT TO HEAR GYANVAPI MOSQUE CASE ON FRIDAY 20TH MAY SK
Gyanvapi Masjid Case: జ్ఞానవాసి మసీదు కేసు.. వారణాసి కోర్టుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జ్ఞానవాపి మసీదు
Gyanvapi Masjid Case: జ్జానవాపి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనిపై విచారణపై నిలిపివేయాలని వారణాసికోర్టుకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
ఇప్పుడుదేశమంతా జ్ఞానవాపి మసీదు (Gyanvapi Masjid Case) గురించే చర్చ జరుగుతోంది. మసీదు ప్రాంగణలో ఉన్న బావిలో శివలింగం (Gyanvapi Shivling) లభ్యమవడం సంచలనం రేపుతోంది. దీనిపై సుప్రీంకోర్టు ఏం చెబుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ఈ కేసుపై ఇవాళ విచారణ జరుగుతుందని.. కోర్టు నుంచి స్పష్టత వస్తుంందని అనుకున్నారు. కానీ ఈ కేసుపై విచారణను శుక్రవారానికి అత్యున్నత ధర్మాసనం వాయిదా వేసింది. అంతేకాదు వారణాసి ట్రయల్ కోర్టులో జరగాల్సిన విచారణపైనా స్టే విధించింది. ఇంటే ఇవాళ వారణాసి కోర్టులో కూడా విచారణ జరగదు. రేపే దీనిపై క్లారిటీ వస్తుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీంకోర్టే (Supreme Court) జ్ఞానవాసి కేసుపై విచారణ చేపట్టనుంది.
Supreme Court to hear Gyanvapi mosque case on Friday, 20th May at 3 pm
జ్ఞానవాపి మసీదు కేసుపై హిందూ వర్గాల తరపు అడ్వొకేట్ విష్ణు శంకర్ జైన్ వాదిస్తున్నారు. సీనియర్ అడ్వకేట్ హరి శంకర్ జైన్ ఆరోగ్యం బాగాలేదని..విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. కానీ ముస్లింల తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వొకేట్ హుజేఫా అహ్మదీ మాత్రం ఇవాళ విచారణ జరపాలని కోర్టును కోరారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు లిటికేషన్స్ దాఖలవుతున్నాయని.. అందువల్ల అత్యవసరంగా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తమ విచారణను రేపటికి వాయిదా వేసింది.
మరోవైపు జ్ఞానవాపి మసీదులో చేసిన వీడియోగ్రఫీ సర్వే రిపోర్టును ఇవాళ వారణాసి కోర్టుకు సమర్పించారు. స్పెషల్ అసిస్టెంట్ కమిషనర్ విశాల్ సింగ్, అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్ వీడియో ఫుటేజీ చిప్‌ను సీల్డ్ కవర్లో ఇవాళ కోర్టుకు సమర్పించారు. వారు సమర్పించి రిపోర్టు 10-15 పేజీల ఉంది. మసీదు ప్రాంగణంలో ఏమేం ఉన్నాయి? అనే వివరాలను అందులో పొందుపరిచారు. జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందూ సంస్కృతికి సంబంధించిన చిత్రకళ, దేవతా మూర్తుల బొమ్మల, ధ్వంసమైన విగ్రహాలు ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
కాగా, జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో శివలింగం బయటపడిన ప్రాంతాన్ని సంరక్షించాలని యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 17న ఆదేశించిన విషయం తెలిసిందే. అదే సమయంలో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ నర్సింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇక వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పులో రెండు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.