వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది...

Vande Bharat Express | Train 18 | సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలో ప్రారంభించనున్నారు.

news18-telugu
Updated: February 15, 2019, 6:37 AM IST
వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది...
వందే భారత్ ఎక్స్‌ప్రెస్(File)
  • Share this:
భారతదేశ మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ (ట్రైన్ 18)  సేవలు ఇవాళ ప్రారంభం కానుంది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం రైల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలిస్తారు. ప్రయాణికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు సభ్యులు ఈ ట్రైన్‌లో ప్రయాణించనున్నారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లడానికి ఈ రైలుకు 9 గంటల 45 నిమిషాలు పడుతుంది. మధ్యలో కాన్పూర్, అలహాబాద్ రైల్వే స్టేషన్లలో 40 నిమిషాల పాటు ఆగనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ వేడుకలు నిర్వహించనున్నారు.

vande mataram express, vande mataram express route, vande mataram express fare, vande mataram express speed, vande mataram express train booking, train 18, train 18 schedule, train 18 ticket cost, piyush goyal, వందేమాతరం ఎక్స్‌ప్రెస్, పీయూష్ గోయల్, ట్రైన్ 18
వందేమాతరం ఎక్స్‌ప్రెస్


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ట్రైన్ 18ని తయారు చేశారు. అయితే, దానికి తాజాగా ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ అని పేరు పెట్టారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇంజిన్ రహిత మొట్టమొదటి భారత రైలు ఇదే కావడం విశేషం. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే ఎక్కువ సౌకర్యాలు ఈ ట్రైన్లో ఉన్నాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులకు ఓ కొత్త తరహా అనుభూతిని ఇస్తుందని రైల్వే శాఖ చెబుతోంది.

Train 18 renamed as Vande Bharat Express: Piyush Goyal
వందే భారత్ ఎక్స్‌ప్రెస్(File)
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి. అందులో రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు. మొత్తం 1128 మంది ప్రయాణికులు కూర్చునే వెసులుబాటు ఉంది. అన్ని కోచ్‌ల్లోనూ ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. జీపీఎస్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు మంచి అనుభూతిని అందించే సీట్లు, హాట్ స్పాట్ వైఫై, బయో వాక్యూమ్ టాయిలెట్లు ఉంటాయి. ప్రతి కోచ్‌లోనూ ఓ ప్యాంట్రీ ఉంటుంది. వేడివేడిగా ఆహారం, కూల్ డ్రింక్స్ లభిస్తాయి.
First published: February 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>