వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Rail) తరచూ ప్రమాదాలకు గురవుతుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో పశువులను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఆ తరువాత సోమవారం సాయంత్రం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రైలులో వెళ్తుండగా రాళ్ల దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢికొని ఓ మహిళ మృతి చెందింది. గుజరాత్ లోని ఆనంద్ సమీపంలో మంగళవారం సాయంత్రం 4.37 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ కు చెందిన 54 ఏళ్ల బిట్రైస్ ఆర్కి బాల్డ్ పీటర్ ను ముంబై వెళ్తున్న ఎక్స్ ప్రెస్ రైలు ఢికొట్టింది. రైల్వే ట్రాక్ దాటుతుండగా అత్యంత వేగంతో వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టింది. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
A 54-year-old woman died after being hit by the semi high-speed #VandeBharatExpress train near Anand in #Gujarat. Read more here. #VandeBharatTrain#Gujarathttps://t.co/K3HpAh5gYN
— The Telegraph (@ttindia) November 8, 2022
భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రతిష్టాత్మకంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. ముంబై-గాంధీనగర్ రూట్లో వందే భారత్ రైలు సేవల్ని అందించనుంది. న్యూ ఢిల్లీ-వారణాసి, న్యూ ఢిల్లీ-మాతా వైష్ణో దేవి కాట్రా రూట్లో వందే భారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి. ఇటీవల ముంబై-గాంధీనగర్ రూట్లో వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. ఈ వందే భారత్ ట్రైన్లో 16 ఎయిర్ కండీషన్డ్ బోగీలు ఉంటాయి. అందులో రెండు ఎగ్జిక్యూటీవ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌కు రూ.2,505, చైర్ క్లాస్‌కు రూ.1,385 ఛార్జీ చెల్లించాలి. మొత్తం 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. సూరత్, వడోదర, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
వచ్చే ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాటికి 75 వందే భారత్ రైళ్లను నడపాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హైస్పీడ్ ట్రైన్. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 52 సెకండ్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వందే భారత్ రైలు ప్రత్యేకత. వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) సెప్టెంబర్ 30న ప్రారంభించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat, Vande Bharat Train