ఈ ప్రపంచాన్ని అత్యుత్తమ ప్రదేశంగా మార్చేలా వినూత్న ఆలోచనలను అందించే శక్తి .. సాహిత్యం, కళలు, చర్చా కార్యక్రమాలకు ఉందని 'వ్యాలీ ఆఫ్ వర్డ్స్' ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ తెలిపింది. ఆరవ అంతర్జాతీయ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఫెస్టివల్ (International Arts and Literature Festival).. వ్యాలీ ఆఫ్ వర్డ్స్ 2022 (Valley Of Words 2022) నవంబరు 13న ప్రారంభం కానుంది. ఈ లిటరేచర్ ఫెస్టివల్‌లో ఎంతో కీలకమైన 'వోక్స్ పాపులీ' పార్లమెంటేరియన్ డిబేట్‌ను ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి డాక్టర్ ఆమ్నా (Dr Amna) నిర్వహిస్తారు. ఈ చర్చా కార్యక్రమాన్ని నవంబర్ 13న మధ్యాహ్నం 1 గంటలకు ప్రసారం చేస్తారు. 'వాక్స్ పాపులి' (Vox Populi)లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటేరియన్లు రాజకీయాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థ, సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చలో పాల్గొంటారు.
ఈసారి "పట్టణీకరణతో మాత్రమే రెండంకెల వృద్ధి సాధ్యమవుతుంది" అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన చట్టసభ సభ్యులు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఇందులో డా. అశోక్ బాజ్‌పాయ్ (BJP), వివేక్ కృష్ణ తంఖా (Congress), సంత్ బల్బీర్ సీచెవాల్ (AAP), ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా (RJD), డాక్టర్ అమర్ పట్నాయక్ (BJD), కె. కేశవ రావు ( TRS), డా. వి. శివదాసన్ (CPIM), లావు శ్రీ కృష్ణ దేవరాయలు (YSRC) పాల్గొంటారు. డీబీ లైవ్, దేశబంధు వార్తాపత్రిక గ్రూప్ ఎడిటర్ రాజీవ్ రంజన్ శ్రీవాస్తవ ఈ కార్యక్రామానికి కాంటెస్ట్ సెట్ చేశారు. డాక్టర్ ఆమ్నా క్యూరేటర్‌గా వ్యవహరిస్తారు. NDLIతో పాటు ఇతర ప్రసాద మాధ్యమాల్లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
మన జీవితానికి క్రియేటివ్ ఇన్‌పుట్‌లు, డిబేట్లు, ప్రజా ప్రతినిధుల ఆలోచనలు ఎంతో అసరమని అన్నా డాక్టర్ ఆమ్నా అన్నారు. ప్రజా ప్రతినిధుల చర్చలు, ఆలోచనలు వర్తమానంపై మన అవగాహనకు కొత్త కోణాలను జోడిస్తాయని ఆమె తెలిపారు. చర్చల్లో ఎంపీలు చెప్పే అభిప్రాయాలు క్రియేటివ్ విజన్‌లని.. ఇవి పబ్లిక్ డొమైన్‌లోని సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ ఎంతో విలువైనవి వారు పేర్కొన్నారు. ఇక ఫెస్టివల్ క్యూరేటర్, విధాన చరిత్రకారుడు, ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను అర్థవంతంగా వ్యక్తీకరించడానికి విభిన్నమైన ఎంపీల ప్యానెల్‌ను మన బోర్డ్ ఆఫ్ గవర్నర్ డాక్టర్ అమ్నా కలిగి ఉండటం ఈ ఫెస్టివల్‌కు గొప్ప విశేషమని అన్నారు. పట్టణీకరణ, వృద్ధి అనే అంశంపై చర్చకు ఇది కీలకమైన సమయమని.. ఇది భారతదేశ స్వాతంత్ర్యం 'అమృత్‌కాల్'ను గుర్తించే విశేషఘటన అని పేర్కొన్నారు. దీనిని చక్కగా నిర్వహించగలిగితే.. మనలోని అనేక సమస్యలను అద్భుతంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. అప్పుడే నిజమైన విశ్వ గురువు అవతరించలగమని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: National