హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Video: హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి

Video: హిమాచల్‌లో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మృతి

కిన్నోర్ జిల్లాలో విరిగిపడిన కొండ చరియలు

కిన్నోర్ జిల్లాలో విరిగిపడిన కొండ చరియలు

కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏదో భూకంపం సంభవించినట్లుగా భారీ బండ రాళ్లు కిందకు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొండచరియలు విరిగిపడి 9 మంది పర్యాటకులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగ్లా-చిత్కుల్ రహదారిలలో బత్సేరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతులంతా ఢిల్లీకి చెందిన వారేనని అక్కడి అధికారులు చెప్పారు. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో.. కొండల పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్లు కిందకు దూసుకొచ్చాయి. బత్సేరి లోయలో ఉన్న ఓ బ్రిడ్జిపై పడడంతో అది కుప్పకూలిపోయింది. అంతేకాదు పక్కనే ఉన్న పలు కార్లపై బండరాళ్ల పడ్డాయి. ఈ ఘటనలో పలు కార్లతో పాటు పర్యాటకుల విశ్రాంతి గదులు ధ్వంసమయ్యాయి. చిత్కుల్ నుంచి సంగ్లాకు వెళ్తున్న ఓ వాహనంపైనా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 9 మంది అక్కడికక్కడే చనిపోయారు.కొండ చరియలు విరిగిపడుతున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఏదో భూకంపం సంభవించినట్లుగా భారీ బండ రాళ్లు కిందకు దూసుకొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పెద్ద సంఖ్యలో రాళ్లు రోడ్డుతో పాటు పర్యాటకుల విశ్రాంతి గదులపై పడడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

First published:

Tags: Himachal Pradesh, Tourism

ఉత్తమ కథలు