అజాత శత్రువు అటల్‌జీ: వెంకయ్య నాయుడు

ఓటమిని కూడా ఎంతో హుందాగా అంగీకరించే వాజ్‌పేయిలాంటి నాయకుడిని దేశం ఇప్పటి వరకు చూడలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.

news18-telugu
Updated: August 29, 2018, 7:12 PM IST
అజాత శత్రువు అటల్‌జీ: వెంకయ్య నాయుడు
వాజ్‌పేయి చిత్రపటం వద్ద వెంకయ్య నాయుడు నివాళి
  • Share this:
ధివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి దేశ రాజకీయ కిరీటంలో కలకితురాయిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడిన వాజ్‌పేయి...ఆ విలువలను దేశ రాజకీయాలకు సైతం నేర్పిన నాయకుడన్నారు. హైదరాబాద్‌లో ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన వాజ్‌పేయి స్మారక ప్రసంగంలో దేశానికి వాజ్‌పేయి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మహ్మూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీని చూపించారని, 23 కూటమి పార్టీలతో స్థిరమైన ప్రభుత్వాన్ని నడిపించడంలోనూ తన సత్తాను చూపించారని అన్నారు. వాజ్‌పేయి కీలక అంశాలపై ఏకాభిప్రాయం సాధించగలిగేవారని, అజాత శత్రువుగా కొనియాడారు.

వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


ఓటమిని కూడా ఎంతో హుందాగా అంగీకరించే వాజ్‌పేయిలాంటి నాయకుడిని దేశం ఇప్పటి వరకు చూడలేదన్నారు. ఎలాంటి అంతర్గత, బయటి ఒత్తిళ్లకు వాజ్‌పేయి తలొగ్గేవారు కారని చెప్పారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రసంగంలోని కీలక అంశాలు..

వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


కర్తవ్య నిర్వహణలో బాధ్యత... మాటలతో కట్టిపడేసే చతురత... దేశ ప్రయోజనాల విషయంలో దృఢత్వం ఉన్న వ్యక్తిత్వం వాజ్ పేయి సొంతం.
వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి


అటల్ జీ అజాత శతృవు. వారి జీవితం తెరిచిన పుస్తకం. 70 ఏళ్ళ పాటు ప్రజలతో మమేకమౌతూ, అణువణువునా దేశభక్తితో, అడుగడుగునా ఆత్మవిశ్వాసంతో సాగిన ఆయన ప్రస్థానం చరిత్రలో సుస్థిరం. మాటల్లో చెప్పే విలువలను, ప్రవర్తనలోనూ పాటించే అటల్ జీ లక్షణం, ఆయన్ను ఆదర్శ పురుషుడిగా మార్చింది.
వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


అటల్ జీ గొప్ప నాయకుడు మాత్రమే కాదు సృజనశీలి, రచయిత, కవి, భావుకుడు మరియు తత్త్వవేత్త, కార్యదక్షుడు, పాలనాదక్షుడు, స్ఫూర్తి ప్రదాత. చట్టసభల్లో ఆయన పాత్ర, పరిపాలనలో ఆయన ముద్ర, ప్రసంగాల్లో వారి చతురత, పాలనా సంస్కరణల్లో వారి నూతన పంథా మరచిపోలేము.
వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి


అటల్ జీ ఉపన్యాసాలే నన్ను రాజకీయాల దిశగా ప్రేరేపించాయి. జాతీయ వాద భావజాలం దిశగా నా లాంటి లక్షలాది మందిని మంత్రముగ్ధుల్ని చేసి, ప్రేరణ అందించారు. వారి అభిమానాన్ని, ప్రేమను, మార్గదర్శకాన్ని, ఆదరణను పరిపూర్ణంగా పొందిన వారిలో నేను కూడా ఒకణ్ని.
వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి


వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
వాజ్‌పేయి స్మారక ప్రసంగం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు


అటల్ జీ కంటే ముందు, ఆయన ప్రసంగాలే నాకు బాగా దగ్గరయ్యాయి. నేనే కాదు... పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదలుకుని, ఎందరో జాతీయ, అంతర్జాతీయ నాయకులు వాజ్ పేయి ప్రసంగాలకు ముగ్ధులయ్యే వారు. వివిధ సమస్యల పట్ల లోతైన అవగాహనతో తన వాక్ప్రవాహాన్ని కొనసాగించారు. మాటల్లో తియ్యదనం, కార్యదక్షతలో కరుకుదనం, దౌత్యంలో దృఢత్వం ఆయన సొంతం. అణుపరీక్షలు, కార్గిల్ ఉదంతాలే దీనికి దృష్టాంతాలు. లాహోర్ బస్సు దౌత్యం, ఆగ్రా చర్చలు ఆయన దౌత్యనీతికి ఉదాహరణలు. నెయ్యంలో చిత్తశుద్ధి, కయ్యంలో కార్యశుద్ధి ఆయనలోని విలక్షణతలు. వాజ్ పేయి గారి వ్యక్తిత్వం, వక్తృత్వం, మితృత్వం మరియు కర్తృత్వంతో కూడిన నేతృత్వాన్ని ఎప్పటికీ మరచిపోలేను. శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి గారిని కేవలం ఒక పార్టీకి నాయకుడిగా గాక, ఒక జాతికి నాయకుడిగా ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారు.
వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి


Published by: Janardhan V
First published: August 29, 2018, 7:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading