హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Vaishno Devi Stampede: మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది భక్తులు మృతి.. న్యూఇయర్ వేళ విషాదం

Vaishno Devi Stampede: మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది భక్తులు మృతి.. న్యూఇయర్ వేళ విషాదం

Vaishno Devi Stampede: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్త ఏడాది తొలి రోజే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

  న్యూఇయర్ వేళ జమ్మూకాశ్మీర్‌ (Jammu and Kashmir)లో విషాదం నెలకొంది. కత్రాలోని మాాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట (Vaishno Devi Stampede) జరిగింది. ఈ ఘటనలో 12 మంది భక్తులు మరణించారు. చాలా మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూకట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైష్ణోదేవి భవన్‌ (Vaishodevi bhawan)లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో అక్కడ స్వల్ప వివాదం చోటుచేసుకొని, పరస్పరం తోసుకున్నారు. ఒకరి కింద మరొకరు పడడడం..కొందరు తొక్కుకుంటూ వెళ్లడంతో.. పలువురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

  కేరళలో తెరుచుకున్న శబరిమల ఆలయం.. మకర జ్యోతి దర్శనం ఏ రోజు అంటే..

  అర్ధరాత్రి 02.45 గంటల సమయంలో మాతా వైష్ణోదేవి భవన్‌లో తొక్కిసలాట జరిగిందని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 12 మంది మరణిచంచారని, మరో 13 మంది గాయపడినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఓ గొడవ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఆయన చెప్పారు.

  Uttar Pradesh: యూపీలో 4ఏళ్ల చిన్నారి ప్రాణాలకు ముప్పు తెచ్చిన గాలిపటం దారం

  వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాటపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్త ఏడాది తొలి రోజే ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు PMNRF నుంచి రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామమని, గాయపడ్డ వారికి రూ.50వేలు ఇస్తామని ఆయన ట్వీట్ చేశారు.

  డౌట్ లేదు.. థర్డ్ వేవ్ వచ్చేసింది... ఆ నగరాల్లో భారీగా పెరిగిన ఆర్-ఫ్యాక్టర్

  మృతుల కుటుంబాలకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల పరిహారం ఇస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. వైద్య ఖర్చులను దేవస్థానం బోర్డే భరిస్తుందని పేర్కొంది.

  ఈ ఘటనపై ఇప్పటికే జమ్మూకాశ్మీర్ ఎల్‌జీతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి మాట్లాడారు. తొక్కిసలాట ఎలా జరిగిందని ఆరా తీశారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించినట్లు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం తెలిపింది.

  First published:

  Tags: Jammu, Jammu and Kashmir

  ఉత్తమ కథలు