వరదల్లో ప్రాణాలకు తెగించి పసిబిడ్డను కాపాడిన పోలీస్.. హ్యాట్సాఫ్ అంటున్న జనం..

బాత్ టబ్‌ను నెత్తిన పెట్టుకుని.. అందులో పసిబిడ్డను జాగ్రత్తగా పడుకోబెట్టి.. మెడ లోతు నీళ్లల్లో ఒకటిన్నర కి.మీ అలాగే నడుచుకుంటూ వచ్చాడు. మొత్తం మీద ఆమెను, ఆమె బిడ్డను సురక్షిత ప్రదేశానికి చేర్చాడు.

news18-telugu
Updated: August 2, 2019, 11:40 AM IST
వరదల్లో ప్రాణాలకు తెగించి పసిబిడ్డను కాపాడిన పోలీస్.. హ్యాట్సాఫ్ అంటున్న జనం..
బాత్ టబ్‌లో చిన్నారిని మోసుకెళ్తున్న పోలీస్
  • Share this:
పోలీసులంటే కఠినంగా ఉంటారు.. రుబాబుగా మాట్లాడుతారు.. ఇది చాలామందిలో నాటుకుపోయిన అభిప్రాయం.అయితే పైకి అలా కఠినంగా ఉండొచ్చేమో గానీ.. సందర్భం వచ్చినప్పుడు వాళ్లలోని మరో కోణం కూడా బయటపడుతుంది. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తామెప్పుడూ ముందే ఉంటామని.. అవసరమైతే ప్రాణాలకు తెగించైనా వారి ప్రాణాలను కాపాడుతామని తాజాగా ఓ పోలీస్ అధికారి నిరూపించాడు. గుజరాత్‌లోని వడోదర వరదల్లో చిక్కుకుపోయిన ఓ తల్లిని,ఆమె బిడ్డను ఆయన కాపాడాడు.

వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని వడోదరాలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. దీంతో సహాయక చర్యల కోసం స్థానిక పోలీసులు అక్కడికి వెళ్లారు. ఓ ఇంటి చుట్టూ విపరీతమైన వరద నీరు చేరడాన్ని గమనించారు. ఇంటి లోపల ఓ తల్లి పసిబిడ్డను పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను, ఆమె బిడ్డను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఓ పోలీస్ అధికారి ముందుకు కదిలారు.బాత్ టబ్‌ను నెత్తిన పెట్టుకుని.. అందులో పసిబిడ్డను జాగ్రత్తగా పడుకోబెట్టి.. మెడ లోతు నీళ్లల్లో ఒకటిన్నర కి.మీ అలాగే నడుచుకుంటూ వచ్చాడు. మొత్తం మీద ఆమెను, ఆమె బిడ్డను సురక్షిత ప్రదేశానికి చేర్చాడు. బాత్ టబ్‌లో ఓ బెడ్ షీట్ పరిచి.. అందులో పసిబిడ్డను పడుకోబెట్టి తలపై మోసుకుంటూ తీసుకొచ్చానని సదరు పోలీస్ అధికారి తెలిపారు. పోలీస్ చేసిన ఈ సహాయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జనం ఆ పోలీస్‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఐపీఎస్ షంషేర్ సింగ్ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.


First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>