Fake Vaccination: ఇదేం వ్యాక్సినేషన్‌.. ఖాళీ సిరంజితో ఇంజెక్షన్​ ఇచ్చిన నర్సు.. వీడియో వైరల్

ఖాళీ సిరంజీతో వ్యాక్సిన్ ఇస్తున్న నర్సు( Image: Twitter)

వ్యాక్సిన్​ తీసుకున్నానని భావించిన హుస్సేన్.. ఇంటికి వెళ్లి తన స్నేహితుడు తీసిన వీడియోను సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశాడు.

  • Share this:
దేశంలో కరోనా కట్టడికి ఏకైక మార్గంగా భావిస్తోన్న వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీహార్​లో కూడా మాస్​ వ్యాక్సినేషన్​ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైవ్​లో ప్రజలు అధిక సంఖ్యంలో పాల్గొని వ్యాక్సిన్​ తీసుకుంటున్నారు. అయితే, తాజాగా సరన్​ జిల్లాలోని చాప్రా వ్యాక్సినేషన్​ కేంద్రంలో ఒక అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఒక నర్సు సిరంజిలో వ్యాక్సిన్ ఎక్కించకుండానే ఇంజెక్షన్​ ఇచ్చింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు నర్సుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

జూన్ 21న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చప్రా జిల్లాలోని బహ్రాంపూర్ ఇమాంబరా సమీపంలోని ఉర్దూ పాఠశాలలో వ్యాక్సినేషన్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నారు. దీంతో, అజార్​ హుస్పేన్​ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్​ కేంద్రానికి వెళ్లాడు. వ్యాక్సిన్​ కోసం ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడున్న నర్సులు త్వరగా వ్యాక్సిన్​ ఇస్తున్నారు. ఈ క్రమంలో చందా కుమారి అనే నర్సు హుస్సేన్ అనే వ్యక్తికి సిరంజిలో వ్యాక్సిన్​ లేకుండానే ఇంజెక్షన్​ ఇచ్చింది. హుస్సేన్​​ వ్యాక్సిన్​ తీసుకుంటుండగా పక్కనే ఉన్న అతని స్నేహితుడు వీడియో తీశాడు. అయితే, వ్యాక్సిన్​ తీసుకున్నానని భావించిన హుస్సేన్.. ఇంటికి వెళ్లి తన స్నేహితుడు తీసిన వీడియోను సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేశాడు.

అయితే ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు అసలు విషయం చెప్పారు. దీంతో, సదరు నర్సు ఖాళీ సిరంజితో ఇంజెక్ట్ చేసిందని గుర్తించాడు. వీడియోను పరిశీలిస్తే.. హుస్సేన్​కు కోవిడ్​–19 వ్యాక్సిన్ ఇచ్చే ముందు సదరు మహిళా నర్సు బిజీగా మాట్లాడుతుండటాన్ని మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఆమె ఒక రేపర్ నుంచి సిరంజిని తీసివేసి, దానిలో వ్యాక్సిన్‌ నింపకుండానే హుస్సేన్ ఎడమచేతి భుజానికి ఇచ్చింది. నిజంగానే హుస్సేన్ తీసుకున్నానని భావించిన హుస్సేన్​ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు.



సోషల్​ మీడియోలో వీడియో వైరల్​..
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ సంఘటనపై సరన్​ జిల్లా ఇమ్యునైజేషన్​ ఆఫీసర్​ డాక్టర్​ అజయ్​ కుమార్​ మాట్లాడుతూ ‘‘నర్సు చందా కుమారికి షోకాజ్​ నోటీసు జారీ చేశాం. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించాం. ప్రస్తుతానికి ఆమెను విధుల నుంచి తొలగిస్తున్నాం.” అని పేర్కొన్నారు. కాగా, నర్సు ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. బాధితుడు తనకు వీలైన రోజు మరోసారి వచ్చి వ్యాక్సిన్​ తీసుకోవాలని కోరారు.
First published: