హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పెళ్లైన మహిళతో పాడుపని.. తెల్లవారు జామున ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. ఆ తర్వాత..

పెళ్లైన మహిళతో పాడుపని.. తెల్లవారు జామున ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు.. ఆ తర్వాత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttar Pradesh: యువకుడితో మహిళకు కొన్నిరోజులుగా సీక్రెట్ గా ఎఫైర్ నడుస్తోంది. ఈ క్రమంలో తరచుగా అతను మహిళ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు వీరిని గమనించారు.

  • Local18
  • Last Updated :
  • Uttar Pradesh, India

కొందరు పవిత్రమైన వివాహబంధాన్ని నీరుగారుస్తున్నారు. పెళ్లైన తర్వాత.. ఇతరులతో వివాహేతర సంబంధాలు (Extramarital affair)  పెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల యువతులు సీక్రెట్ గా బాయ్ ఫ్రెండ్ లను మెయింటేన్ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల యువకులు కూడా ఇతర అమ్మాయిలతో చాటింగ్ చేసి, ఎవరికి తెలియకుండా పార్క్ లకు, లాడ్జీలకు వెళ్లి అడ్డమైన పనులు చేస్తున్నారు. కొన్ని సార్లు భార్య, భర్తలు ఇలాంటి పనులు చేసేటప్పుడు రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన అనేక ఘటనలు వెలుగులోనికి వచ్చాయి. దీంతో పెళ్లి బంధాలు కాస్త, విడాకుల వరకు వెళ్తున్నాయి. ఇలాంటి ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని మొరాదాబాద్‌లో ఒక వివాహిత పాడు పనిచేస్తు అడ్డంగా దొరికిపోయింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలున్నకూడా మరో యువకుడితో ఎఫైర్ పెట్టుకుంది. మొరాదాబాద్‌లోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్వాన్‌పూర్ నగర్ పంచాయతీ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. సదరు మహిళ భర్త, సౌదీకి వెళ్లి తన భార్య , పిల్లల కోసం కష్టపడి పనిచేసి డబ్బులు పంపిస్తున్నాడు. అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో మహిళకు, అదే ప్రాంతంలో ఉండే మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. వీళ్ల వాలకాన్ని కొన్ని రోజులుగా చుట్టుపక్కలవారు గమనిస్తున్నారు. ఇదే కాలనీలో మహిళ బంధువులు కూడా ఉంటున్నారు.

ఎలాగైన వీరిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకొవాలని కాలనీ వాసులు అనుకున్నారు. ఒక రోజు యువకుడు, తెల్లవారు జామున మహిళ ఇంటికి గోడదూకి వెళ్లడాన్ని చుట్టుపక్కలవారు చూశారు. వెంటనే మెల్లగా వారి ఇంటికి వెళ్లారు. మహిళ బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత.. ఇంటికి వెళ్లే చూసేసరికి అప్పటికే మహిళ, అతని ప్రియుడితో రాసలీలల్లో మునిగి ఉన్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కాలనీ వాసులు, బంధువులు యువకుడిని పట్టుకుని అక్కడ స్థంబానికి కట్టేశారు. ఆతర్వాత.. అందరు తీవ్రంగా చావబాదారు.

దీంతో యువకుడు మరోసారి ఇలాంటి తప్పు చేయనని అక్కడి వాళ్ల కాళ్లమీదపడ్డాడు. మహిళ బంధువులు, తల్లిదండ్రుడు కూడా ఆమెను తీవ్రంగా మందలించారు. ఈ క్రమంలో మరొసారి ఇలాంటి పాడు పనిచేయనని మహిళ అందరి ముందు సిగ్గుపడింది. దీంతో చుట్టుపక్కలవారు యువకుడిని పంపించేసి, మహిళను ఇంటికి వెళ్లమన్నారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అక్కడ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదుచేయలేదని సమాచారం.

First published:

Tags: Extra marital affair, Love affiar, Uttar pradesh

ఉత్తమ కథలు