ఉత్తరప్రదేశ్‌లోని (Uttar pradesh) మిర్జాపూర్ జిల్లా జిగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉగాది తెలుగు సంవత్సర వేడుకల్లో మునిగి ఉన్నారు. ఇంతలో.. అకస్మాత్తుగా అడవి ఎలుగుబంటి రావడంతో ప్రజల్లో భయాందోళనలకు గురయ్యారు. ఎలుగుబంటి ఒక్కసారిగా అక్కడ ఉన్నవారిపై దాడికి దిగింది. ప్రజలు అరుస్తూ.. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్తించారు.
ఈ క్రమంలో.. ఎలుగుబంటి గ్రామస్తులపై ఒకరి తర్వాత ఒకరిపై దాడి చేసింది. భయాందోళనకు గురై గ్రామంలోని ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లుకుని డోర్ లు లాక్ చేసుకున్నారు. మరికొందరు..తమ ఇళ్లపైకి ఎక్కికూర్చున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు.
మీర్జాపూర్‌లోని జిగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెగురాబన్ సింగ్ గ్రామంలో బుధవారం ఎలుగుబంటి అడవి నుండి దారితప్పి నివాస ప్రాంతానికి చేరుకుందని పోలీసులకు సమాచారం అందింది. పొలంలో పని చేస్తున్న గ్రామస్థులు ఎలుగుబంటిని చూసి అరవడం ప్రారంభించారు.
దీంతో ఎలుగుబంటి పావురపు పొలంలో దాక్కుంది. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ బృందం అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయడంతో ఎలుగుబంటి పొలం నుంచి బయటకు వచ్చి గ్రామస్తులపై దాడి చేసింది.
గ్రామస్తులపై దాడి చేసిన ఎలుగుబంటి..
ఎలుగుబంటి దాడి కారణంగా 16 ఏళ్ల తానియా, 18 ఏళ్ల నకిత, 65 ఏళ్ల సియారామ్ గాయపడ్డారు. దీని తరువాత, ఎలుగుబంటి అక్కడి నుండి మురాజ్‌పూర్‌కు పారిపోయింది. గ్రామస్థులు గట్టిగా శబ్దం చేయడంతో, అక్కడ కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇందులో సురేష్ వయసు 40 ఏళ్లు, వికాస్ 30 ఏళ్లు, పార్వతి 50 ఏళ్లు, వినయ్ 27 ఏళ్లు గాయపడ్డారు. దీని తర్వాత ఖాళీగా ఉన్న తేజు బింద్ ఇంట్లోకి ఎలుగుబంటి ప్రవేశించింది. వెంబడించడంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ బృందం బయటి నుంచి తలుపులు వేసి సీజ్ చేశారు.
సంఘటనా స్థలంలో అటవీ సిబ్బంది ఉన్నారు: డీఎఫ్‌ఓ
ఎలుగుబంటి కనిపించడంతో గ్రామస్తులకు సమాచారం అందించినట్లు మీర్జాపూర్ డీఎఫ్‌వో అరవింద్ రాజ్ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారితో పాటు అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులు గట్టిగా అరుస్తూ చేస్తూ పరుగులు తీయడంతో ఎలుగుబంటి దాడి చేయడంతో కొందరు గ్రామస్తులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఎలుగుబంటి ఖాళీ ఇంట్లో దాక్కుంది. వెంటనే అధికారులు బోన్ ను తెచ్చే పనుల్లో పడ్డారు. తొందరలోనే ఎలుగుబంటిని పట్టుకుంటామని ఫారెస్టు అధికారులు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Uttar pradesh, VIRAL NEWS