Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో వరద విలయం.. 46 మంది మృతి.. 11 మంది గల్లంతు

ఉత్తరాఖండ్‌లో వర్షాలతో విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది

Uttarakhand Floods Latest News | ఉత్తరాఖండ్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిష్కారం ఇస్తామని సీఎం ధామి ప్రకటించారు. ముఖ్యంగా కుమాన్, ఘర్వాల్ ప్రాంతాల్లో భారీగా వరద నష్టం, ప్రాణనష్టం వాటిల్లింది.

  • Share this:
    ఉత్తరాఖండ్‌లో వర్షాలు (Uttarakhand Rains)  బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ ప్రభావంతో ఇప్పటి వరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది వరదల్లో (Uttarakhand Floods) గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే ఇంత ఉంటే, ఇంకా లెక్కల్లోకి రాని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమచారం. వరద అత్యంత ప్రభావం చూపిన ప్రాంతాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ (Uttarakhand CM Pushkar Singh Dhami) . అక్కడ పరిస్థితులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్ల గురించి ప్రశ్నించారు. వారికి సౌకర్యాలు కల్పించాలని, ఆహారం, వసతి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరదల వల్ల భయంకరంగా నష్టం జరిగిందని సీఎం పుష్కర్ ధామీ అన్నారు. రాష్ట్రంలో ఒక్కచోట అని కాకుండా మొత్తం అంతా భారీగానే నష్టం జరిగిందని చెప్పారు. సాధారణ పరిస్థితులు రావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం వరద సహాయక చర్యల కోసం రూ.10 కోట్లను తాత్కాలికంగా విడుదల చేశారు.

    మరోవైపు ఈ రోజు (బుధవారం) కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ (Uttarakhand Weather Report) ప్రకటించింది. అయితే, మరో వారం పాటు ఎలాంటి వర్షాలు ఉండకపోవచ్చని అంచనా వేసింది. ఈ వారంలో ఉత్తరాఖండ్‌లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అది భారీ వరదలకు దారితీసింది. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి.



    వరదలతో విలవిలలాడుతున్న ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగాయి. స్థానిక ప్రభుత్వ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కొండచరియలు విరిగిపడి ఉన్న చోట వాటిని తొలగిస్తున్నారు. రోడ్డు రవాణా సులభంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.



    మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారు. డెహ్రాడూన్ వెళ్లి రాష్ట్రంలో వరదలు, సహాయక చర్యలు, కేంద్రం నుంచి అందించే సాయంపై ముఖ్యమంత్రి పుష్కర్ ధామీతో చర్చించనున్నారు.

    ఉత్తరాఖండ్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున పరిష్కారం ఇస్తామని సీఎం ధామి ప్రకటించారు. ముఖ్యంగా కుమాన్, ఘర్వాల్ ప్రాంతాల్లో భారీగా వరద నష్టం, ప్రాణనష్టం ఏర్పడింది. స్థానికంగా ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం ధామీ బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు. అయితే, చార్ ధామ్ యాత్ర మార్గంలో మాత్రం ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని, ప్రజలు, ప్రయాణికులు, టూరిస్టులు ఆందోళన చెందవద్దని సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: