హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: జైలులో రిమాండ్ ఖైదీ రచ్చ.. పూరీ, సబ్జి ఇవ్వలేదని ఏంచేశాడంటే..

OMG: జైలులో రిమాండ్ ఖైదీ రచ్చ.. పూరీ, సబ్జి ఇవ్వలేదని ఏంచేశాడంటే..

కారాగారం

కారాగారం

Uttarakhand: జైలులో ఖైదీ సెక్షన్ 307 కేసులో విచారణలో ఉన్నాడు. అతనికి జైలులో ఉన్న మాన్యువల్‌ ప్రకారం ఆహరం ఇస్తున్నారు. కానీ అతగాడు జైలు సిబ్బందిపట్ల దురుసుగా ప్రవర్తించాడు.

  • Local18
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India

ఉత్తరాఖండ్‌లోని (uttarakhand)  జైలులో అనుకొని ఘటన జరిగింది. హల్ద్వానీ జైలులో ఖైదీకి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన గొడవ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల ప్రకారం.. జైలులోని ఒక ఖైదీ ఆహారానికి సంబంధించిన జైలు మాన్యువల్‌కు వ్యతిరేకంగా వెళ్లి ఆహారాన్ని డిమాండ్ చేశాడు. దీంతో సెక్యూరిటీలో ఉన్న కానిస్టేబుల్‌కు, ఖైదీకి మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త మాట మాట పెరిగి కొట్టుకొవడం వరకు వెళ్లింది.

హల్ద్వానీ జైలులో ఉన్న దేవేంద్ర బిష్త్ అనే ఖైదీ ఆహారం కోసం పూరీ, కూరగాయలను డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. జైలు సెక్యూరిటీ సిబ్బంది తనకు నచ్చిన ఆహారం ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆ ఖైదీ ఆగ్రహంతో సెక్యూరిటీ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడు. నిరసనగా, సెక్యూరిటీ గార్డు ఖైదీపై చేయి చేసుకున్నాడు. దీంతో ఖైదీకి కూడా కోపం వచ్చింది.. ప్రతిగా సెక్యూరిటీ గార్డుపై కూడా చేయి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. గొడవ జరగడంతో ఇతర భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని ఎలాగోలా ఇద్దరినీ విడదీసి శాంతింపజేశారు.

సెక్షన్ 307 కేసులో విచారణలో ఉన్న ఖైదీ పేరు దేవేంద్ర బిష్త్ అని హల్ద్వానీ సీనియర్ జైలు సూపరింటెండెంట్ సతీష్ సుఖిజా తెలిపారు. అతను జైలు మాన్యువల్‌కు వ్యతిరేకంగా వెళ్లి ఆహారాన్ని (పూరీ-కూరగాయలు) డిమాండ్ చేశాడు. అది నెరవేరలేదు. దీనికి సంబంధించి కోపంతో అతను జైలు సెక్యూరిటీ గార్డుతో దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు అతనిపై చేయి చేయవలసి వచ్చింది. అయితే.. ప్రస్తుతం ఈ కేసులో ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు పేర్కొన్నారు.

First published:

Tags: Uttarakhand

ఉత్తమ కథలు