Home /News /national /

Uttarakhand: చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు రద్దు -పూజారుల దెబ్బకు దిగొచ్చిన BJP సర్కార్

Uttarakhand: చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డు రద్దు -పూజారుల దెబ్బకు దిగొచ్చిన BJP సర్కార్

చార్ ధామ్ దేవస్థానం బోర్డు రద్దు

చార్ ధామ్ దేవస్థానం బోర్డు రద్దు

చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును ర‌ద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటన చేశారు. హిందూ ఆలయాలపై సర్కారు పెత్తనాన్ని నిరసిస్తూ పూజారులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం బోర్డును రద్దు చేసింది. ఉత్తరాఖండ్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా ఈ నిర్ణయానికి రాజకీయంగానూ ప్రాధాన్యం ఏర్పడింది..

ఇంకా చదవండి ...
దేవభూమి ఉత్తరాఖండ్ లో హిందువులకు అత్యంత పవిత్రమైన చార్ ధామ్ ఆలయాలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ ధామ్ ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని పెంచుతూ తీసుకొచ్చిన చట్టంపై అక్కడి పూజారులు, సాధువులు ఆందోళన చేపట్టగా బీజేపీ సర్కారు ఎట్టకేలకు దిగొచ్చింది. చార్‌ధామ్ దేవ‌స్థానం బోర్డును ర‌ద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రకటన చేశారు. అన్ని అంశాల‌ను అధ్య‌య‌నం చేసిన త‌ర్వాతే చార్‌ ధామ్ దేవ‌స్థానం బోర్డు చ‌ట్టాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఉత్తరాఖండ్ లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, ప్రఖ్యాత ఆలయాలపై బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ గా పిలిచే ప్రఖ్యాత కేదార్‌నాథ్‌, బ‌ద్రీనాథ్‌, య‌మునోత్రి, గంగోత్రీ ఆల‌యాలతోపాటు మొత్తం 51 ఆలయాలను ఒక గొడుకు కిందికి తీసుకొస్తూ, వాటి నిర్వహణలో ప్రభుత్వం పరిధితిన పెంచుతూ బీజేపీ సర్కారు 2019లో చార్ ధామ్ దేవస్థానం బోర్డు చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించి, దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసింది. అయితే, ఆలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని నిరసిస్తూ పూజారులు ఆందోళనబాట పట్టారు. వారి నిరసనలకు సాధువులు కూడా మద్దతిచ్చారు. దీంతో రెండేళ్లుగా అక్కడ పూజారులకు, ప్రభుత్వానికి మధ్య వాగ్వాదాలు కొనసాగుతున్నాయి.

రోజూ మధ్యాహ్నం కోడలిని అలా చూస్తూ తట్టుకోలేక అత్తమామల అకృత్యం -అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు



పూజారులు, సాధువుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో చార్ ధామ్ దేవస్థానం బోర్డు కొనసాగింపుపై మ‌నోహ‌ర్ కంట్ ద‌యానీ నేతృత్వంలో ఉన్న‌త స్థాయి క‌మిటీ ఏర్పాటయింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే బోర్డు రద్దుకు నిర్ణయం తీసుకున్నామని, ఆ మేరకు చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ఉత్తరాఖండ్ సీఎం ధామి ఇవాళ ప్రకటన చేశారు. ఇది ముమ్మాటికీ పూజారుల విజయమేనని కామెంట్లు వస్తున్నాయి. కాగా,

800 year old mummy : సంచలన చరిత్రను వెలికితీశారు -పెరూలో తక్కువ వయసున్న మమ్మీ -ఈజిప్ట్ వెలుపల తొలిసారి


మొత్తం 70 సీట్లున్న ఉత్తరాఖండ్ లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2017లో బీజేపీ భారీ మెజార్టీ తెలిచి ఉత్తరాఖండ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఏకంగా ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చేయడం వివాదాస్పదమైంది. ఈసారి కాంగ్రెస్ నుంచి ఎదురుగాలి తప్పదనే సంకేలుండటంతో ఎన్నికలలోపే కీలక వివాదాలను పరిష్కరించుకోవడంలో భాగంగానే చార్ ధామ్ దేవస్థానం బోర్డును బీజేపీ రద్దు చేసిందనే వాదన వినిపిస్తోంది.
Published by:Madhu Kota
First published:

Tags: Bjp, Uttarakhand

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు