• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • UTTARAKHAND GLACIER TRAGEDY RAINI VILLAGE ELDERS BLAME REMOVAL OF TEMPLE FOR CHAMOLI TRAGEDY SK GH

Uttarakhand Glacier Tragedy: ఆ దేవత కన్నెర్ర.. ఆలయాన్ని కూల్చడం వల్లే జల విలయం..!

Uttarakhand Glacier Tragedy: ఆ దేవత కన్నెర్ర.. ఆలయాన్ని కూల్చడం వల్లే జల విలయం..!

ఉత్తరాఖండ్ విలయం

చార్ ధామ్ తీర్థయాత్రకు రక్షకుడిగా పరిగణించబడుతున్న ఈ ధారి దేవి మందిరాన్ని తరలించకూడదని స్థానికుల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. అయినా, ప్రాజెక్టుకు అడ్డుగా ఉందన్న కారణంతో ఆలయాన్ని వేరే చోటుకు మార్చారు

  • Share this:
చల్లని మంచు పర్వతం, ఆహ్లాదకరమైన వాతావరణం.. కానీ ఇక్కసారిగా హిమనీనదం ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా మంచు చరియలు విరగిపడ్డాయి. దీంతో ధౌలిగంగా, అలకనంద నదులు ఉగ్రరూపాన్ని దాల్చాయి. ఫలితంగా ఒక్కసారిగా ప్రవాహ ఉదృతి పెరిగిపోయింది. ఫలితంగా చమోలి జిల్లాలోని తపోవన్ ప్రాంతంతో పాటు రేని గ్రామం సమీపంలోని రుషి గంగ పవర్ ప్రాజెక్టు దగ్గర ఆకస్మికంగా వరదలు వచ్చాయి. ధౌలి గంగా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో డ్యామ్ కొట్టుకుపోయింది. డ్యాం నుంచి నీరు పొంగి ప్రవహించడంతో సమీప గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. మరోవైపు తపోవన్ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న దాదాపు 150 మంది గల్లంతయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.

అయితే, ఈ విషాదం వెనుక భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రకృతి ప్రకోపమా? లేక అధికారుల నిర్లక్ష్యమా?.. ఇంకేమైనా కారణాలున్నాయా? అనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. రేని గ్రామ పెద్దలు మాత్రం మరో వాదనను తెరపైకి తెస్తున్నారు. సమీపంలోని ‘దేవి మాతా’ ఆలయాన్ని తొలగించడమే ఈ విషాదానికి కారణమని, దేవత కోపాన్ని ఇప్పడు చూడాల్సి వస్తుందని అంటున్నారు. ఇది వందలాది మంది మరణాలతో పాటు వినాశనానికి దారితీస్తుందని వారు అంటున్నారు. 2013 ఉత్తరాఖండ్ విషాదం సమయంలో కూడా ఇలాంటి కథనాలే వెలువడ్డాయి.

వారు చెబుతున్న దాని ప్రకారం, రుద్రప్రయాగ్ జిల్లాలోని శ్రీనగర్ సమీపంలో అప్పటి ప్రభుత్వం హైడల్ పవర్ ప్రాజెక్ట్ చేపట్టాలని తలపెట్టింది. అయితే, ప్రాజెక్టుకు అడ్డుగా ఉన్న ధారి దేవి మందిరాన్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరలించారు. అయితే, చార్ ధామ్ తీర్థయాత్రకు రక్షకుడిగా పరిగణించబడుతున్న ఈ ధారి దేవి మందిరాన్ని తరలించకూడదని స్థానికుల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. అయినా, ప్రాజెక్టుకు అడ్డుగా ఉందన్న కారణంతో ఆలయాన్ని వేరే చోటుకు మార్చారు. దీంతో ఆలయాన్ని సందర్శించడానికి గ్రామస్తులు నది ఒడ్డున నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తద్వారా రోడ్డు పక్కన (విద్యుత్ స్తంభం కింద) ప్రధాన ఆలయానికి ప్రతీకగా రైనీ గ్రామస్తులు ఒక చిన్న ఆలయాన్ని నిర్మించుకున్నారు. తద్వారా వృద్ధులతో సహా ప్రతి ఒక్కరూ ఆలయాన్ని సులువుగా సందర్శిస్తున్నారు.


అయితే, గత సంవత్సరం ఈ ఆలయాన్ని పవర్ ప్లాంట్ అధికారులు తొలగించారు. వారు దానిని వేరే ప్రదేశానికి మారుస్తామని హామీ ఇచ్చారు. కాని అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని గ్రామస్తులు అంటున్నారు. దీని కారణంగానే ఇప్పడు ఈ ప్రళయం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఇది దేవత కోపాన్ని స్పష్టంగా సూచిస్తుందని వారు అంటున్నారు. దీనిపై రైనీ గ్రామానికి చెందిన బినా రానే అనే వ్యక్తి మాట్లాడుతూ ‘‘అధికారులు ఆలయాన్ని తొలగించిన రోజే, వారు దేవత కోపాన్ని ఆహ్వానించారు. దైవత శాపం వల్లే ఈ విషాదం జరిగిందని నమ్ముతున్నాం.” అని అన్నాడు. ఉఖా దేవి అనే వృద్ధ మహిళ రానా అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ.. ‘‘ఆలయాన్ని తొలగించడం ద్వారా దేవతని బాధపెట్టారు. తద్వారా, ఇప్పుడు దేవత కోపాన్ని ఎదుర్కోక తప్పదు. అని అన్నారు. కాగా, చెట్ల సంరక్షణ, పరిరక్షణే లక్ష్యంగా 1973లో ప్రారంభమైన చిప్కో ఉద్యమాన్ని రైనీ గ్రామంలోనే ప్రారంభించారన్ని విషయం తెలిసిందే.
Published by:Shiva Kumar Addula
First published:

అగ్ర కథనాలు