Uttarakhand Glacier Disaster: చేపల వింత ప్రవర్తన...ఉత్తరాఖండ్ విలయాన్ని ముందే పసిగట్టేసాయా?

చేపల వింత ప్రవర్తన...ఉత్తరాఖండ్ విలయాన్ని ముందే పసిగట్టేసాయా?

Uttarakhand Glacier Disaster: ఉత్తరాఖండ్‌లో ఆదివారం వరద విలయం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మంచు కొండలు విరిగిపడడంతో ధౌలిగంగ నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరద ఉధృతి ధాటికి రైనీ గ్రామంలో రుషిగంగ డ్యామ్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 200 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే ఈ విలయానికి స‌రిగ్గా ఓ గంట ముందు ఆ ప్రాంతానికి సుమారు 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న లాసు గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది.

  • Share this:
    ఉత్తరాఖండ్‌లో ఆదివారం వరద విలయం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. మంచు కొండలు విరిగిపడడంతో ధౌలిగంగ నదికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరద ఉధృతి ధాటికి రైనీ గ్రామంలో రుషిగంగ డ్యామ్ కొట్టుకుపోయింది. ఈ ఘటనలో 200 మందికి పైగా గల్లంతయ్యారు. అయితే ఈ విలయానికి స‌రిగ్గా ఓ గంట ముందు ఆ ప్రాంతానికి సుమారు 70 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న లాసు గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. ఆ వింత‌ను చూడ‌టానికి గ్రామంలోని ప్ర‌జ‌లు క‌నీసం ఇంటికి ఒక‌రైనా అక్క‌డికి వచ్చారు. ఆ వింత జ‌రిగింది అల‌క‌నంద న‌దిలో. ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో వేల కొద్దీ చేప‌లు న‌ది ఒడ్డుకు ద‌గ్గ‌ర‌గా చేతికి అందేంత లోతులోనే వెళ్తున్నాయి. ఇది చూసి గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ త‌ర్వాత వ‌ల‌లు కూడా అవ‌స‌రం లేకుండా కుప్ప‌లుగా చేతికి అందుతున్న ఆ చేప‌ల‌ను ఇళ్ల‌కు తీసుకెళ్లారు. కానీ మ‌రి కాసేప‌ట్లోనే త‌మ‌కు కొన్నికిలోమీట‌ర్ల దూరంలో ఓ విల‌యం రాబోతున్న‌ద‌ని వాళ్లు ఊహించ‌లేదు. అల‌క‌నంద‌కు ఉప‌న‌ది అయిన ధౌలిగంగ‌లో హిమ‌నీన‌దాలు విరిగి ప‌డి ఆక‌స్మిక వ‌ర‌ద విరుచుకుపడింది.

    సాధార‌ణంగా చేప‌లు ఎప్పుడూ అలా ఒడ్డ‌కు చేరువ‌గా, చేతికి అందే లోతులో వెళ్ల‌వ‌ని, న‌ది మ‌ధ్య‌లో చాలా లోతులో ఉంటాయ‌ని ఈ చేప‌ల‌ను మొద‌ట‌గా చూసిన వాళ్ల‌లో ఒక‌రైన అజ‌య్ పురోహిత్ అనే వ్య‌క్తి చెప్పాడు. చేప‌లు ఎందుకిలా వింత‌గా ప్ర‌వ‌రిస్తున్నాయ‌ని గ్రామ‌స్థులు ఆశ్చ‌ర్య‌పోయారు త‌ప్ప‌.. అప్ప‌టికే నీళ్లు ఆకుప‌చ్చ రంగులో నుంచి బుర‌ద రంగులోకి మార‌డాన్ని వాళ్లు గుర్తించ‌లేక‌పోయారు.

    చేప‌లు ముందే గుర్తించాయా..?
    ఇలాంటి విప‌త్తుల‌ను చేప‌లు ముందే గుర్తిస్తాయా అంటే అవున‌నే అంటున్నారు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని సీనియర్ సైంటిస్టు శివ‌కుమార్‌. నీటి ప్ర‌వాహంలోని ప్ర‌కంప‌న‌లు చేప‌ల సెన్సర్ వ్య‌వ‌స్థ‌కు ముందే తెలిసి ఉంటుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. చేప‌ల‌కు పార్శ్వ రేఖా అవ‌య‌వాలు ఉంటాయి. వీటి ద్వారా నీళ్ల‌లో క‌ద‌లిక‌లు, ఒత్తిడిలో మార్పును ఇవి గుర్తిస్తాయి. ఇవి చాలా సున్నిత‌మైన‌వి. చిన్న మార్పు కూడా వీటిని క్రియాశీలం చేసి చేప‌లను షాక్‌కు గురి చేస్తాయి అని శివ‌కుమార్ చెప్పారు. ఈ సంద‌ర్భంలో వ‌ర‌ద ముందు వ‌చ్చిన శ‌బ్దాన్ని చేప‌లు ముందే గ్ర‌హించి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న అంచ‌నా వేశారు.
    Published by:Sridhar Reddy
    First published: