ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు..కుమావున్ ప్రాంతంలో భారీగా మంటలు..

ఉత్తర, మధ్య భారతదేశం తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే అటవీ మంటలు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

news18-telugu
Updated: May 29, 2020, 4:20 PM IST
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు..కుమావున్ ప్రాంతంలో భారీగా మంటలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
 కార్చిచ్చు దెబ్బతో ఉత్తరాఖండ్‌ అడవులు నాలుగు రోజులుగా మాడిమసి అయిపోతున్నాయి. మొత్తం 46 ప్రాంతాల్లో అగ్ని దేవుడి ధాటికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 51.43 హెక్టార్ల అటవీ ప్రాంతం ఆహుతి అయ్యింది. అంతేకాదు సగానికి పైగా వన్యప్రాణుల జాతుల ఉనికి ప్రమాదంలో పడింది. ఇప్పటివరకు కుమావున్ ప్రాంతంలో గడిచిన సంవత్సరాల్లో 21 సార్లు కార్చిచ్చు వ్యాపించగా, అందులో ప్రస్తుత అగ్ని ప్రమాదమే భారీ నష్టాన్ని కల్పించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు ఉత్తర, మధ్య భారతదేశం తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలే అటవీ మంటలు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. అటు సోషల్ మీడియాలో పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో హరిత వనం మాయమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  #SaveTheHimalayas, #PrayForUttarakhand, #UttarakhandForestFires అంటూ ట్విట్టర్‌లో తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే దేశం ఇప్పటికే COVID-19 మహమ్మారితో పోరాడుతోంది, ఈ సమయంలో ఇలాంటి అటవీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ రెండింటితో పాటు, దేశంలోని పలు రాష్ట్రాల్లో పంట పొలాలపై మిడతలు దాడులు చేస్తున్నాయి. 'టిడ్డి దళ్' పేరిట పలు రాష్ట్రాల్లో ఈ కీటక సమూహాలు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. మరోవైపు వడగాలుల కారణంగా ఉత్తరాఖండ్ అడవులలో కార్చిచ్చును నియంత్రించడం కష్టంగా మారింది. ఉత్తరాఖండ్ అటవీ మంట విస్తరిస్తున్న ప్రాంతంలో  మేఘావృతమై వర్ష సూచన కనిపిస్తోంది.

మరోవైపు మే 23న అడవి మంటలు చెలరేగడం ప్రారంభమవగా ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో వరుసగా నాలుగో రోజు కూడా కార్చిచ్చు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు 46 ప్రాంతాల్లో అటవీ మంటలు పర్వత రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. అటు మంటలను ఆర్పడానికి అగ్నిమాపక బృందాలను రంగంలోకి దిగి పరిస్థితిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అటవీ మంటల వల్ల ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతం కుమావున్ ప్రాంతం, గత 4 రోజులలో ఇక 21 ప్రదేశాల్లో అటవీ మంటలు సంభవించాయి. ఉత్తరాఖాండ్ లో అడవి మంటల కారణంగా ఇప్పటివరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని నివేదికలు తెలియజేస్తున్నాయి.  ఘర్వాల్ ప్రాంతం రిజర్వు అటవీ ప్రాంతంలో వరుసగా 16 నుంచి 9 ప్రదేశాల్లో అడవి మంటలు సంభవించాయి.

అటు ఘోర అటవీ కార్చిచ్చుతో పాటు, రాష్ట్రంలో పెరుగుతున్న COVID-19 కేసులపై ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుండగా, అటు బుధవారం రాష్ట్రంలో COVID-19 బారిన పడి 52 మంది పాజిటివ్ గా తేలింది. . రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 401 కు చేరుకుంది. తాజా కేసుల గురించి రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ బుధవారం తెలిపింది, పిథోర్ గడ్, టెహ్రీల జిల్లాల్లో మొత్తం పది మందిని గుర్తించారు. నైనిటాల్‌లో, హరిద్వార్‌లో 6 పాజిటివ్ కేసులు చొప్పున నమోదు కాగా, అల్మోరా, డెహ్రాడూన్‌లో మూడు, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.
First published: May 29, 2020, 4:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading