Home /News /national /

UTTARAKHAND FLOODS ATM CENTRE AND 7 SHOPS WASHED AWAY IN FLASH FLOODS IN UTTARA KASI DISTRICT SK

ATM Washed away: వరదలో కొట్టుకుపోయిన ఏటీఎం.. నగల దుకాణాలు.. ఎంత పోయిందంటే..

నదిలో కొట్టుకుపోతున్న భవనం

నదిలో కొట్టుకుపోతున్న భవనం

ATM Washed Away: వరదలో కొట్టుకుపోయిన ఏటీఎంను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు ఒక రోజు ముందే ఏటీఎంలో 24 లక్షల నగదును డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఆ డబ్బంతా గంగ పాలయింది.

    దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (India Rains) కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాత్లో భయంకరంగా పడుతున్నాయి. హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌ (Uattarakhand Rains)లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వర్షాలు, వరదల ధాటికి ఉత్తరకాశి సహా జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఉత్తరకాశీలోని కుమోలా ఖేడ్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి పురోలా ప్రాంతంలో ఉన్న కుమోలా ఖేడ్ నది తీరం కోతకు గురయింది. నది ఒడ్డున ఉన్న దుకాణాలు వరదలో కొట్టుకుపోయాయి. ఓ ఏటీఎం సెంటర్‌తో (ATM Washed away)పాటు మరో ఏడు షాప్‌లు నదిలో పడిపోయాయి. ఇందులో రెండు నగల దుకాణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వరదలో కొట్టుకుపోయిన ఏటీఎంను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు ఒక రోజు ముందే ఏటీఎంలో 24 లక్షల నగదును డిపాజిట్ చేసినట్లు తెలిపారు. ఆ డబ్బంతా గంగ పాలయింది.

    బంగారం దుకాణాలు కూడా వరదలో కొట్టుకపోవడంతో యజమానులు లబోదిబో మంటున్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఎంత నష్ట జరిగిందన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్ట జరగలేదని పేర్కొన్నారు. వర్షాలు, వరదల వల్ల నది ఒడ్డున ఉన్న అనే నివాస గృహాలు, దుకాణాలకు ఇప్పటికీ ముప్పు ఉందని తెలిపారు. వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కుమోలా ఖేడ్ నది మహోగ్రరూపం దాల్చడంతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.





    నేతాలా, పకోడ నాలాలో కొండచరియలు విరిగిపడటంతో గంగోత్రి హైవేను మూసివేశారు. వర్షాల వల్ల ఖరాడి ప్రాంతంలో యమునోత్రి హైవేపై కూడా రాకపోకలు స్తంభించిపోయాయి. వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. ముస్సోరిలో ఐదు గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భారీ వర్షాలకు నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాల కారణంగా ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై పలుచోట్ల చెత్తాచెదారం వచ్చి చేరింది. గజ్జి బ్యాండ్ సమీపంలో రోడ్డుపై చెట్లు పడిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అగ్నిమాపక, అటవీ సిబ్బంది చేరుకొని రోడ్లపై పడిన చెట్లను తొలగించారు. ఆ తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో చాలాచోట్ల ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Heavy Rains, Uttarakhand

    తదుపరి వార్తలు