హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

తప్పతాగి ఆస్పత్రికి వచ్చిన వైద్యుడు.. ఎమర్జెన్సీ వార్డులో తూలుతూ వైద్యం.. ఎక్కడంటే..

తప్పతాగి ఆస్పత్రికి వచ్చిన వైద్యుడు.. ఎమర్జెన్సీ వార్డులో తూలుతూ వైద్యం.. ఎక్కడంటే..

తాగిన మత్తులో ఉన్న డాక్టర్

తాగిన మత్తులో ఉన్న డాక్టర్

Uttarakhand: అర్ధరాత్రి తమ కుతూరుకి ఆరోగ్యం పాడవడంతో దగ్గరలోని సర్కారు దవాఖానాకు తీసుకెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీ వార్డులో.. ఉన్న డాక్టర్ దగ్గరకు వెళ్లారు. అతను మత్తులో తూలుతున్నాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India

కొంత మంది డాక్టర్లు పవిత్రమైన తమ వృత్తికి చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తిస్తుంటారు. ఎన్నో బాధలతో వారి వద్దకు వెళ్లిన రోగుల పట్ల పట్టనట్లు వ్యవహరిస్తుంటారు. కొంత మంది ఇలా చేయడం వలన అందరు డాక్టర్లపైన ఇదే చెడ్డపేరు ఆపాదించబడుతుంది. దేవుడి తర్వాత.. మనుషులు తమ ప్రాణాలకు కాపాడతారని భావిస్తుంటారు. అందుకే డాక్టర్లను సమాజంలో ఎంతో ఉన్నతంగా చూస్తుంటారు. అయితే.. కొందరు మాత్రం కేవలం డబ్బు మాత్రమే సంపాదించడం పనిగా పెట్టుకుంటారు. రోగులను అసలు పట్టించుకోరు. మరికొందరు తప్ప తాగి ఆస్పత్రులకు వస్తుంటారు. తాగినమైకంలో శస్త్రచికిత్సలు, రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.


పూర్తి వివరాలు.. ఉత్తరాఖండ్ లోని (Uttarakhand) అల్మోరా ఆస్పత్రిలో షాకింగ్ ఘటన జరిగింది. ఆగస్టు 24 న స్థానికంగా ఉండే కుటుంబం తమ కూతురు ఆరోగ్యంపాడవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అప్పుడు.. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న డాక్టర్ దగ్గరకు బాలికను తీసుకెళ్లారు. అప్పుడు.. డాక్టర్ ఫుల్ గా తాగి ఉండటాన్ని బాలిక తల్లిదండ్రులు గమనించారు. అయితే.. తమ కూతురికి సరిగ్గా వైద్యం చేస్తాడో లేదో అంటూ బాధితులు భయపడిపోయారు. తాగుబోతు వైద్యుడు స్పృహలో లేడని, ప్రిస్క్రిప్షన్ కూడా స్పష్టంగా రాయలేకపోయాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. డాక్టర్ కూడా తమతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.డాక్టర్ తాగి ఉన్నాడని అక్కడి సిబ్బందిని నిలదీస్తే.. వారు కూడా డాక్టర్ కే సపోర్ట్ చేశారు. బాధితుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో అక్కడి వారు ఘటనను తమ సెల్ ఫోన్ లలో బంధించారు. ఇక లాభంలేదని... జిల్లా ఆస్పత్రిలో ఏర్పాట్లపై రోగి కుటుంబ సభ్యులు అధికారులను ప్రశ్నించారు. అనంతరం ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లి తమ బిడ్డకు వేరే చోట చికిత్స అందించారు. తాజాగా,ఈ ఘటన వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. దీనిపై అల్మోరా జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమ్ లత ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా, “ఈ విషయంలో రోగి కుటుంబం ఇంకా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ప్రాథమికంగా చూస్తే, వైద్యుడు అస్వస్థతతో ఉన్నాడని, అతనికి మగత కలిగించే మందును తీసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే, ఇంకా విచారణ కొనసాగుతోంది” అని లత తెలిపారు. యాజమాన్యం డాక్టర్‌ను సెలవుపై పంపినట్లు కూడా వర్గాలు తెలిపాయి. అయితే, అతను అనారోగ్య సెలవు తీసుకున్నట్లు కొందరు అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెల్త్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శైలజా భట్ తెలిపారు. "డ్యూటీలో ఉన్న సిబ్బంది, రోగి కుటుంబ సభ్యుల నుండి స్టేట్‌మెంట్లు తీసుకోబడతాయని భట్ పేర్కొన్నారు.Published by:Paresh Inamdar
First published:

Tags: Doctors, Drinkers, Uttarakhand, VIRAL NEWS

ఉత్తమ కథలు