హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

పెళ్లికానీ యువకుడితో వివాహిత ఎఫైర్.. బెడ్ రూమ్ తెరిచి చూస్తే షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..

పెళ్లికానీ యువకుడితో వివాహిత ఎఫైర్.. బెడ్ రూమ్ తెరిచి చూస్తే షాకింగ్ ఘటన.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttarakhand:  ఉదయం ఎంత తలుపు తట్టినా యువకుడు గది తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో.. వెంటనే కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

  • Local18
  • Last Updated :
  • Uttarakhand (Uttaranchal), India

సమాజంలో కొందరు పవిత్రమైన వివాహబంధాన్ని దిగజారుస్తున్నారు. పెళ్లిచేసుకుని మరీ మరోకరితో ఎఫైర్ లు (Affair)  పెట్టుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా మరోకరితో ప్రేమాయణాలు నడిపిస్తున్నారు. కుటుంబం పరువును బజారుకు ఈడుస్తున్నారు. ఇప్పటికే ప్రతిరోజు వివాహేతర సంబంధాల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల మహిళలు, ఇతరులతో ఎఫైర్ లు పెట్టుకుంటుంటే.. మరికొన్ని చోట్ల పురుషులు కూడా వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఈ ఘన కార్యాలు కాస్త వీరి ఇళ్లలో తెలిసి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల ఎఫైర్ ల మూలంగా ప్రాణాలు తీసుకొన్న సంఘటనలు జరుగగా.. ఇంకొన్ని చోట్ల తప్పుడు పనుల వలన ప్రాణాలు పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోనికి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఉత్తరాఖండ్ లోని (Uttarakhand) డెహ్రాడూన్‌లో అమానుష ఘటన జరిగింది. డెహ్రాడూన్ (డెహ్రాడూన్ క్రైమ్ న్యూస్)లో ఓ యువకుడు, యువతి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ధరంపూర్ లోని స్థానికంగా ఉన్న ఒక ఇంట్లోంచి ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు.

గది నుంచి పోలీసులకు ఇంజక్షన్ దొరికింది. వారిద్దరూ ఒకరికొకరు విషం ఎక్కించుకుని మృత్యువుకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘటనపై యువకుడి బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రాథమిక విచారణలో ప్రేమ వ్యవహారంతో వీరి సూసైడ్ కు కారణమని పోలీసులు  భావిస్తున్నారు. కాగా, ఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.

పోలీసుల ప్రకారం, డెహ్రాడూన్‌లోని ధరంపూర్ ప్రాంతంలో ఉంటున్న మహిళకు వివాహమైంది. ఆమె తన తల్లి ఇంటికి వచ్చింది. మృతుడు అవివాహితుడు. ఉదయం ఎంత తట్టినా యువకుడి గది తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గదిలో యువకుడి, వివాహిత మృతదేహాలు పడి ఉన్నాయి.

ఈ విషయమై నెహ్రూకాలనీ సీఓ అనిల్‌కుమార్‌ జోషి మాట్లాడుతూ.. ఇద్దరి సమీపంలో నుంచి ఇంజక్షన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరూ ఒకరికొకరు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజెక్షన్‌లో లభించిన రసాయనంపై ఫోరెన్సిక్ బృందం విచారణ జరుపుతుంది. అదే సమయంలో మృతికి అసలు కారణం పోస్టుమార్టం తర్వాతే తేలనుంది.

మృతుడు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సింగ్ అసిస్టెంట్. కాగా మృతుడు కూడా గతంలో వైద్యరంగంలో పనిచేసేవాడు. యువకుడికి, యువతికి మధ్య ఉన్న సంబంధంపై తమకు ఎలాంటి సమాచారం లేదని యువకుడి బంధువులు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది.

First published:

Tags: Crime news, Illegal affairs, Uttarakhand

ఉత్తమ కథలు