• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • UTTARAKHAND CHIEF MINISTER TIRATH SINGH RAWAT HAS DEBUTED IN HIS NEW ROLE WITH CONTROVERSIAL COMMENTS ON WOMEN WEARING RIPPED JEANS SRD

Tirath Singh : అమ్మాయిల వస్త్రధారణపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొత్త సీఎం

Tirath Singh : అమ్మాయిల వస్త్రధారణపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కొత్త సీఎం

తీరథ్ సింగ్ రావత్

Tirath Singh : ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ అమ్మాయిల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్.

  • Share this:
    ఉత్తరాఖండ్‌ నూతన ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ అమ్మాయిల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్. మాదకద్రవ్యాల వినియోగంపై మంగళవారం నిర్వహించిన ఓ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలు చిరిగిపోయిన జీన్స్‌ ధరించడం సామాజిక విచ్ఛిన్నానికి దారితీస్తుందని వ్యాఖ్యానించారు. " ఓ ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి షాకయ్యా. ఆ వేషధారణతో ఎన్జీవో విషయమై ప్రజలను కలవడానికి వెళితే.. సమాజానికి ఏం సంకేతాలిస్తున్నట్లు? మన పిల్లలకు ఏం సంకేతాలిస్తున్నట్లు? ఇదంతా ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. మనం ఏం చేస్తామో పిల్లులూ అదే చేస్తారు. మనం దేనిని ఫాలో అవుతామో... పిల్లలూ అదే ఫాలో అవుతారు. ఇళ్లలో సంస్కృతి మూలాలను నేర్పించినట్లైతే, ఎంత ఆధునికంగా ఉన్నా పర్లేదు. జీవితంలో ఎన్నడూ వైఫల్యం చెందరు." అని సీఎం తీరథ్ రావత్ పేర్కొన్నారు. ఈ పోకడలు లైంగిక వేధింపులు వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు.

    నేటితరం తలిదండ్రులు ఇలాంటి ​వస్త్రధారణకు అలవాటుపడితే.. తమ పిల్ల్లలకు ఇళ్లలో ఏం నేర్పుతారని ప్రశ్నించారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా అన్ని వయసుల వాళ్లు పోటీపడి మరీ స్కిన్‌ షో చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పాశ్చాత్యీకరణ పేరుతో మనం చిరిగిన పేలికలను వేసుకుంటుంటే.. పాశ్చాత్య ప్రపంచం మాత్రం మనల్ని అనుసరిస్తూ యోగాభ్యాసం చేస్తుందని అన్నారు.


    వారు తమ శరీరాలను పూర్తిగా కప్పుకొని యోగాభ్యాసం చేయడం చూస్తుంటే మనం ఎక్కడ ఉన్నామనే ప్రశ్న ఉత్పన్నమవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నడిపే ఓ మహిళ గురించి ప్రస్తావిస్తూ.. చిరిగిన జీన్స్‌ ధరించి ఆమె సేవ చేస్తూ సమాజానికి ఏం సందేశమిస్తుందని విమర్శించారు. మొత్తానికి ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయ్. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలపై మండిపడుతున్నాయ్.కాగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా ..ఇది ఆధునిక ఇండియా అని, డియర్ బీజేపీ ముఖ్యమంత్రీ.. మీరు యువతకు ఏం చెప్పదలచుకున్నారని అంటూ ట్వీట్ చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    అగ్ర కథనాలు