ఇండియా-చైనా సరిహద్దు దగ్గర కూలిన వంతెన... లారీతో సహా... వైరల్ వీడియో

ఓ భారీ ట్రక్కు ఆ వంతెనపై నుంచి వెళ్తుంటే... దాని బరువును తట్టుకోలేకపోయిన బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది.

news18-telugu
Updated: June 23, 2020, 5:55 AM IST
ఇండియా-చైనా సరిహద్దు దగ్గర కూలిన వంతెన... లారీతో సహా... వైరల్ వీడియో
ఇండియా-చైనా సరిహద్దు దగ్గర కూలిన వంతెన... (credit - twitter - ANI)
  • Share this:
ఓవైపు ఇండియా-చైనా సరిహద్దు వివాదం నడుస్తుండగా.. ఉత్తరాఖండ్‌లో... భారత్-చైనా సరిహద్దుల్లో ఓ వంతెన కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. దీని వెనక చైనా హస్తం ఉందా అనే అనుమానాలు మొదట వ్యక్తం అయ్యాయి. కానీ అదేం లేదనీ... సాధారణంగానే అది కూలిపోయిందని తర్వాత స్పష్టమైంది. అసలేమైందంటే... ఓ భారీ ట్రక్కు... నిండా సరుకులతో... బ్రిడ్జిని దాటబోయింది. ఐతే... దాని బరువును తట్టుకోవడం ఆ వంతెన వల్ల కాలేదు. దాంతో.... లారీ... సరిగ్గా వంతెన దాటేస్తున్న సమయంలో... బ్రిడ్జి... ఒక్కసారిగా కుప్పకూలింది. లారీ కూడా కింద పడిపోయింది. అందులో... డ్రైవర్‌తోపాటూ మరొకరు ఉన్నారు. తీవ్ర గాయాలపాలైన వాళ్లను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

ఇందుకు సంబంధించిన వీడియో... ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. లారీ వెనక... ఓ వ్యక్తి నడుస్తున్నాడు. అతను కూడా జారిపడ్డాడు. కాకపోతే... స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఆ ట్రక్కులో భవన నిర్మాణానికి సంబంధించిన సామగ్రి ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన... లిలామ్ జోహార్ లోయలో... ధాపా-మిలామ్ రోడ్డును కలిపే వంతెనపై జరిగింది. ఈ వంతెన... ఇండియా-చైనా సరిహద్దుకు దగ్గర్లో ఇండియాలో ఉంది. ట్రక్కులో తీసుకెళ్తున్న సామగ్రిని... చైనా సరిహద్దువైపు నిర్మిస్తున్న 65 కిలోమీటర్ల మోటార్ వే కోసం వాడనున్నట్లు తెలిసింది.ఘటన జరిగిన తర్వాత స్థానికులు పరుగున వచ్చి... సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.
First published: June 23, 2020, 5:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading