హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Uttarakhand : ఉత్తరాఖండ్ లో హిమపాతం..26మంది మృతదేహాలు వెలికితీత

Uttarakhand : ఉత్తరాఖండ్ లో హిమపాతం..26మంది మృతదేహాలు వెలికితీత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Uttarakhand avalanche : ఉత్త‌రాఖండ్(Uttarakhand) రాష్ట్రంలోని ఉత్త‌ర‌కాశీలో గ‌త మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న భారీ హిమపాతంలో మృతుల సంఖ్య 26కు చేరింది. శుక్రవారం మరో 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Uttarakhand avalanche : ఉత్త‌రాఖండ్(Uttarakhand) రాష్ట్రంలోని ఉత్త‌ర‌కాశీలో గ‌త మంగ‌ళ‌వారం చోటుచేసుకున్న భారీ హిమపాతంలో మృతుల సంఖ్య 26కు చేరింది. శుక్రవారం మరో 10 మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ సంస్థ ఈ విషయం వెల్లడించింది. క‌శ్మీర్‌ లోని ఓ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్ష‌ణ పొందుతున్న 29 మంది ట్రెయినీ ప‌ర్వ‌తారోహ‌కులు గ‌త మంగ‌ళ‌వారం ఉత్త‌ర‌కాశీలోని ఓ ప‌ర్వ‌తం బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అనంత‌రం ప‌ర్వ‌తాన్ని అధిరోహించ‌డం మొద‌లుపెట్టారు. ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన త‌ర్వాత ఒక్క‌సారిగా హిమ‌పాతం సంభ‌వించింది. దీంతో ప‌ర్వ‌తారోహ‌కులంతా ఆ మంచు దిబ్బ‌ల కింద గ‌ల్లంత‌య్యారు.

స‌మాచారం అందుకున్న అధికారులు వెంట‌నే రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించి గాలింపు చేప‌ట్టారు. ఆర్మీ , నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్‌(NDRF),ఉత్త‌రాఖండ్ స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్‌(SDRF),ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ త‌దిత‌ర బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొన్నాయి. అటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు.

Nobel Peace Prize : 2022 నోబెల్ శాంతి పురస్కారం లభించింది వీళ్లకే

గ‌త మంగ‌ళ‌వారం నుంచి సెర్చింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తుండ‌గా అదేరోజు నాలుగు మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయి. బుధ‌వారం ఒక్క‌బాడీ కూడా ల‌భించ‌లేదు. గురువారం 15 మృత‌దేహాల‌ను, శుక్ర‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు మ‌రో 7 మృత‌దేహాలను వెలికితీశారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 26కు చేరింది. మరో ముగ్గురి జాడ తెలియాల్సి ఉంది. ట్రెయినీ పర్వతారోహకుల్లో బంగాల్‌, ఢిల్లీ, తెలంగాణ , తమిళనాడు , కర్ణాటక , అసోం , హర్యా, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. మృతదేహాలు అన్నింటికీ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు.

Published by:Venkaiah Naidu
First published:

ఉత్తమ కథలు