Home /News /national /

UTTARAKHAND ASSEMBLY ELECTIONS DELHI CM KEJRIWAL PROMISES UNEMPLOYMENT ALLOWANCE JOB QUOTA FOR LOCAL PEOPLE IF VOTED TO POWER SK

Unemployment allowance: నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.5వేల భృతి.. సీఎం సంచలన హామీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Arvind Kejriwal: తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామని.. ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కోటా కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒక నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో మాత్రమే అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీ (Aam Aadmi Party)ఇతర రాష్ట్రాల్లోనూ సత్తాచాటాలని భావిస్తోంది. పార్టీని దేశమంతటా విస్తరించేందుకు ఆమాద్మీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  (Arvind Kejriwal) తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేకాదు సంచలన హామీలతో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఆదివారం ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని హల్ద్వానీ రోడ్ షో నిర్వహించిన  అరవింద్ కేజ్రీవాల్ అనేక హామీలను ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో ఆమాద్మీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు నిరుద్యోగులకు ప్రతి నెల రూ.5వేలు భృతి (Unemployment allowance) ఇస్తామని సంచలన ప్రకటన చేశారు.

    తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ ఉద్యోగం ఇస్తామని.. ఉద్యోగాల్లో స్థానికులకు 80 శాతం కోటా కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కుటుంబంలో ఒక నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే వరకు  నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు . ఉద్యోగాల కల్పన విషయంలో ఢిల్లీ మోడల్‌ను అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు, కంపెనీలు మధ్య వారధిగా ఓ వేదికను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అంతేకాదు నిరుద్యోగులు, వలస కార్మికు సమస్యల్ని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం. అంతేకాదు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు, ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత కరెంటు వంటి గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

    Punjab new CM: పంజాబ్​ రాజకీయ ఉత్కంఠకు తెర.. కొత్త సీఎంగా దళిత నేత



    పోవయ్యా పో.. కేంద్ర వైద్య శాఖ మంత్రిని తోసేసిన ఆస్పత్రి సిబ్బంది.. అసలేం జరిగిందంటే..

    ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం ఆయన చేశారు. ఢిల్లీ ప్రజలకు ఎలాంటి సుపరిపాలన అందిస్తున్నామో.. ఉత్తరాఖండ్‌కు అలాంటి పాలన అందిస్తామని వ్యాఖ్యానించారు అరవింద్ కేజ్రీవాల్. అవినీతిని అంతం చేస్తే వ్యవస్థలన్నీ దానంతట అవే గాడిలో పడతాయని.. ఉత్తరాఖండ్‌‌లో ప్రస్తుతం, గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అక్కడి వనరుల్ని దోచుకోవడంలోనే నిమగ్నమయ్యాయని విమర్శలు గుప్పించారు కేజ్రీవాల్.



    One Rupee Coin: ఒక్క పాత రూపాయి నాణెం ఎంత ధర పలికిందో తెలుసా..

    21 ఏళ్లుగా ఉత్తరాఖండ్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని.. వాటన్నింటినీ కేవలం 21 నెలల్లో పరిష్కారిస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఆమాద్మీ పార్టీ అభ్యర్థి అజయ్‌ కొఠియాల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉత్తరాఖండ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్‌, గోవాలో కూడా ఇదే రకమైన హామీలు, పథకాలను ప్రకటిస్తూ సంచలనాలకు తెరదీస్తోంది ఆమాద్మీ పార్టీ.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Arvind Kejriwal, JOBS, Unemployment allowance, Uttarakhand

    తదుపరి వార్తలు