హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రోజుకు మూడుసార్లు రంగు మారుతున్న అమ్మవారి విగ్రహం.. !

రోజుకు మూడుసార్లు రంగు మారుతున్న అమ్మవారి విగ్రహం.. !

ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారన్నారు.  వినాయకుని విగ్రహం నుండి ఈ ఆలయ చరిత్రను గుర్తించవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.

ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారన్నారు.  వినాయకుని విగ్రహం నుండి ఈ ఆలయ చరిత్రను గుర్తించవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.

ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారన్నారు.  వినాయకుని విగ్రహం నుండి ఈ ఆలయ చరిత్రను గుర్తించవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

అల్మోరా... ఇది దేవభూమి ప్రాంతం. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోఉంది.  ఇక్కడ చరిత్ర చాలా పురాతనమైనది. ఇక్కడ మనం అనేక  దేవాలయాలను చూడవచ్చు. అల్మోరా నుండి దాదాపు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటువంటి ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మా సయాహి దేవి ఆలయం. ఈ ఆలయం పర్వత శిఖరంపై ఉంది.

స్థానిక ప్రజల ప్రకారం, ఈ ఆలయాన్ని కట్యూరి రాజులు ఒక రాత్రిలో నిర్మించారు. గుడి చుట్టూ దట్టమైన అటవీప్రాంతం ఉండడంతో పూర్వం ఇక్కడ సింహాలు, పులులు కనిపించేవి. రోజులో అమ్మవారి మూడు రంగులు కనిపిస్తాయని భక్తులు తెలిపారు. సూర్యోదయం కాగానే అమ్మవారు బంగారు వర్ణంలో, పగటిపూట అమ్మవారి రూపం నల్లగా, సాయంత్రం ముదురు రంగులో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. నిజమైన హృదయంతో ఈ అమ్మవారి గుడికి వచ్చి ఏ భక్తుడైనా... అతను ఈ విషయాలను అక్కడ చూడవచ్చు.  ఈ ఆలయంలో గణేశుడి విగ్రహం కూడా ఉంది. ఇది 1254కు సంవత్సరానికి చెందినది చెబుతుంటారు. ఇది కాకుండా, ఆలయంలో భైరవుడు, హనుమాన్ మొదలైన విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి.

ఆలయం చాలా పురాతనమైనదని ఇక్కడి పూజారి జీవన్ నాథ్ గోస్వామి తెలిపారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో నిర్మించారన్నారు.  వినాయకుని విగ్రహం నుండి ఈ ఆలయ చరిత్రను గుర్తించవచ్చు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఇక్కడ అమ్మవారి మూడు రూపాల్లో దర్శనమిస్తాయని  పూజరి పేర్కొన్నారు. ఎవరైతే నిజమైన హృదయంతో వస్తారో, వారి ప్రతి కోరిక నెరవేరుతుంది. ప్రజల కోరికలు నెరవేరినప్పుడు, ప్రజలు ఇక్కడ ఈ గంటను కట్టడం లేదా భండారా మొదలైన వాటిని నిర్వహిస్తారు.

ఇక్కడకు వచ్చే భక్తుడు శంకర్ దత్ మాట్లాడుతూ.. తాను  హల్ద్వానీ ప్రాంతం నుంచి  వచ్చానని చెప్పాడు. గత 10 సంవత్సరాలుగా ఆయన ఈ ఆలయానికి వస్తున్నారన్నారు. తాను ఎలాంటి కోరికలు కోరినా అమ్మ వెంటనే తీరుస్తుందని చెప్పాడు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.అమ్మ వారి బాధలను వెంటనే దూరం చేసే అపారమైన అనుగ్రహం ఉందని, సాక్షాత్తు అమ్మవారు ఇక్కడే ఉన్నారని భక్తురాలు నీమా రుబాలీ చెప్పారు. అమ్మవారి వల్ల  తనకు నెరవేరిన కోరికలు చాలా ఉన్నాయని ఆమె చెప్పింది. ప్రజలు తమ కోరికలతో మొక్కలు చెల్లించుకోవానికి అమ్మవారి ఆలయానికి వస్తుంటారు.

First published:

Tags: National News, Uttarakhand

ఉత్తమ కథలు